మహేష్ త్రివిక్రమ్ సినిమాకు అనుకోని కష్టాలు...?

murali krishna
సూపర్ స్టార్‌ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్‌ ల కాంబో లో సినిమా కు అన్ని ఏర్పాట్లు అయ్యాయి అనుకున్న ప్రతి సారి కూడా ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది మరి.


ఆగస్టు లో సినిమా షూటింగ్‌ ను ప్రారంభించబోతున్నట్లుగా ఇటీవలే యూనిట్‌ సభ్యులు అధికారికంగా కూడా ప్రకటించారు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆగస్టు లో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం విషయంలో దర్శకుడు ఆలోచనలో పడ్డాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఆగస్టు 1 నుండి షూటింగ్‌ లకు బ్రేక్ అన్నట్లుగా నిర్మాతల మండలి అధికారికంగా ప్రకటించారు. దాంతో డేట్లు తీసుకుని అడ్వాన్స్ లు ఇవ్వడం వల్ల డబ్బు వృదా అవుతుందని.. అందుకే షూటింగ్‌ లు నిలిచి పోయి మళ్లీ ప్రారంభం అయిన తర్వాత మాత్రమే షూటింగ్ కు సంబంధించిన తేదీని మళ్లీ ప్రకటించాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం అందుతోందట.. అంటే సినిమా ప్రారంభం అవ్వాలంటే సెప్టెంబర్‌ వరకు వెయిట్‌ చేయాల్సిందేనని తెలుస్తుంది.


ఒక వేళ నిర్మాతల మండలి యొక్క డిమాండ్స్ ను పరిష్కరించకుంటే ఎక్కువ రోజులు షూటింగ్‌ ల యొక్క సమ్మె జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే షూటింగ్‌ ను మొదలు పెట్టడం కంటే కాస్త వెయిట్‌ చేయడం బెటర్ అన్నట్లుగా త్రివిక్రమ్‌ ఆలోచనలో ఉన్నాడు అనే వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు కూడా షూటింగ్‌ ను నెమ్మదిగానే మొదలు పెట్టాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ కుటుంబ సభ్యులతో విదేశాల్లో నెలల తరబడి ఎంజాయ్ చేస్తున్నారట.ఇటీవలే గౌతమ్‌ ను విదేశాల్లో చదువు కోసం పంపించడం జరిగింది. మరో వైపు మహేష్ బాబు కుటుంబ సభ్యుల యొక్క పార్టీ లకు మరియు ఫంక్షన్స్ కు కూడా హాజరు అవ్వుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: