'సీతా రామం' కి గెస్ట్ గా ప్రభాస్ ప్లేస్ లో మరో పాన్ ఇండియా హీరో..?

Anilkumar
ప్రస్తుతం వచ్చే ఆగష్టు నెలలో చాలా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.. ఇక ఈ నెల మొత్తం కూడా పెద్ద సినిమాల నుండి మీడియం రేంజ్ చిన్న సినిమాలు మొత్తం కూడా వరుసగా రిలీజ్ డేట్స్ ప్రకటించారు..అయితే మరి రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమాల్లో హ్యాండ్సమ్ హీరోగా పేరు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్ కూడా ఉన్నారు..ఇక ఈయన మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. కాగా దుల్కర్ సల్మాన్ హీరోగా బాలీవుడ్ యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన సినిమా సీతా రామం..పోతే  ఈ సినిమా నుండి నిన్న ట్రైలర్ రిలీజ్ అయ్యి బాగా ఆకట్టుకుంది. 

అయితే యుద్ధం నేపథ్యంలో అందమైన ప్రేమ కథను మరింత ఎమోషనల్ గా తెరకెక్కించాడు డైరెక్టర్.ఇదిలావుంటే హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ నిర్మించారు.ఇకపోతే  ఈ సినిమాను తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో ఏకకాలంలో నిర్మించారు.. కాగా ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని ఆగష్టు 5న థియేటర్స్ లోకి రావడానికి సిద్ధంగా ఉంది..ఇక ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రొమోషన్స్ ను స్టార్ట్ చేసారు.. పోతే ఈ క్రమంలోనే నిన్న ఈ సినిమా నుండి ట్రైలర్ రిలీజ్ చేసి మరిన్ని అంచనాలను పెంచేశారు..

అయితే  ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇక మరి ఈ ఈవెంట్ కు గెస్ట్ గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాబోతున్నాడు అని కామెంట్స్ వినిపించాయి..ఇదిలావుంటే ఇప్పుడు ఈ ఈవెంట్ కోసం డార్లింగ్ కాదు మరొక పాన్ ఇండియా స్టార్ రాబోతున్నాడు అంటూ ఇప్పుడు కథనాలు వస్తున్నాయి.. అయితే ఆయన మరెవరో కాదు.. ట్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోల లిష్టులోకి చేరిపోయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని ఇప్పుడు తాజాగా గుసగుసలు వినిపిస్తున్నాయి.. అయితే మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందొ తెలియదు కానీ ఈయన వస్తున్నాడు అనే వార్త విని నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఇది నిజం అవ్వాలని కోరుకుంటున్నారు.అయితే ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న కూడా కీలక పాత్రలో నటించడంతో ఈ సినిమాపై ఆమె ఫ్యాన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..అంతేకాదు  అలాగే ఈ సినిమాలో గౌతమ్ మీనన్, భూమిక చావ్లా, ప్రకాష్ రాజ్, సమంత, వెన్నెల కిషోర్, మురళీ శర్మ వంటి వారు ప్రధాన పాత్రలో నటించారు. అయితే మరి ఈ సినిమా ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: