బాలయ్య తో కోడి రామకృష్ణ సినిమా ఆగిపోవడానికి కారణం ఇదేనట..!!

Divya
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ డైరెక్టర్లు కోడి రామకృష్ణ కూడా ఒకరు. ఈయన డైరెక్షనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉండేది. సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటి నుంచి చివరి రోజుల వరకు ఈయన సినిమా గురించి తప్ప మరే విషయాన్ని కూడా అంతగా ఆలోచించలేదట అప్పట్లో దాసరి నారాయణరావు రాఘవేంద్రరావు తర్వాత ఎక్కువ పేరు పొందింది కోడి రామకృష్ణ అని చెప్పవచ్చు. ఎక్కువ సక్సెస్ లు అందుకున్నది కూడా ఈయనే. ఎక్కువగా నక్సలై నేపథ్యంలో కథలు గ్రామీణ నేపథ్యంలోని కథలు చిత్రాలకు ఈయన తర్వాతే ఎవరైనా అని ఇండస్ట్రీలో టాక్ ఉండేది.

ఎంతమంది స్టార్స్ సైతం కోడి రామకృష్ణ డైరెక్షన్లో నటించి మంచి విజయాలను అందుకున్నారు. తక్కువ బడ్జెట్ లోని మంచి సినిమాలు తెరకెక్కించి బారి లాభాలను తెచ్చి పెట్టాడు. ముఖ్యంగా ఏదైనా సమయానికి అనుకున్న విధంగా ఆ సినిమాని పూర్తి చేయడం ఈ అనుకున్న అలవాటు. ముఖ్యంగా లవ్ యాక్షన్ ఎమోషన్ కామెడీ ఇలా అన్ని తరహాలో కూడా సినిమాలో ఉండేలా జాగ్రత్తగా తీసుకొని తెరకెక్కించేవారు. అయితే అలా ఎంతోమంది హీరోలతో సినిమాలు చేసిన.. బాలకృష్ణ కి ఎక్కువ హిట్లు ఇచ్చారని చెప్పవచ్చు.
బాలకృష్ణ కోడి రామకృష్ణ డైరెక్షన్లో మంగమ్మగారి మనవడు, ముద్దుల కృష్ణయ్య, మువ్వగోపాలుడు, ముద్దుల మామయ్య, ముద్దుల మేనల్లుడు, బాలగోపాలుడు వంటి తదితర సినిమాలలో నటించారు అయితే ఆ తర్వాత కూడా బాలయ్య సినిమాల చేయడానికి ఆసక్తి చూపేవారు.. అలా గోపాల్ రెడ్డి నిర్మాణంలో ఒక సినిమాని మొదలు పెట్టక అయితే ఆ సినిమా మాత్రం పూర్తి కాలేదట కోడి రామకృష్ణ కూతురు దివ్య నిర్మాతగా మారినప్పుడు ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ సినిమా బడ్జెట్ కారణంగా ఆగిపోలేదని.. గోపాల్ రెడ్డి కుటుంబ సంబంధమైన కారణాల వలన ఆరోగ్య కారణాలవల్ల ఆ సినిమా పూర్తి కాలేదని తెలియజేసింది. ఇంకా ఆ సినిమా 25% పూర్తి చేస్తే సినిమా పూర్తి అవుతుంది కానీ ఆయన కోలుకున్నాక పూర్తి చేయాలని చూశారు కానీ కుదరలేదని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: