వావ్.. KGF 2 సెంచరి, విక్రమ్ హాఫ్ సెంచరి!

Purushottham Vinay
కన్నడ స్టార్ హీరో రాకింగ్ స్టార్ యష్ ఇంకా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన ఈ ఏడాది అతిపెద్ద పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ 'కేజీఎఫ్ చాప్టర్-2'. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్లపైగా వసూళ్లు రాబట్టి కన్నడ ఇండస్ట్రీకి దేశావ్యాప్తంగా పేరు తెచ్చిపెట్టింది.ఈ మెగా సూపర్ హిట్ చిత్రం శుక్రవారంతో మొత్తం 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా ఈ సినిమా డైరెక్టర్ మూవీ ప్రొడక్షన్ కంపెనీ హోంబలే ఫిల్మ్‌స్ దేశవ్యాప్తంగా కూడా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపడం జరిగింది.ఇక తమిళ సీనియర్ స్టార్ హీరో లోకనాయకుడు కమల్ హాసన్ 'విక్రమ్' మూవీ జూన్ 3వ తేదీన న రిలీజై ఎన్నో రికార్డులు కొల్లగొట్టింది.తమిళనాడులో బాహుబలి రికార్డులు చేరిపేసి ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 450 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి ఈ ఏడాది ఆర్ ఆర్ ఆర్, కేజీఎఫ్ సినిమాల తరువాత మూడవ స్థానంలో నిలిచింది.


పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయిన సినిమాలో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సూర్య కూడా నటించగా.. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజు దర్శకత్వంలో తెరకెక్కిన మూవీకి అనిరుధ్ మ్యూజిక్ ప్లస్ పాయింట్ కాగా.. చిత్రం ఇక విడుదలై 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది మూవీ యూనిట్. ఇక కమల్ అన్ని భాషల్లో కూడా థాంక్స్ చెప్తూ వీడియో రిలీజ్ చేయడం విశేషం.ఇక ఈ రెండు సినిమాలు కూడా ఆడియన్స్ ని మెప్పించడంలో అఖండమైన విజయం సాధించాయి. ఇవి కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమా లాగే ఎక్కువ లాంగ్ రన్ పూర్తి చేసుకున్నాయి. ఇక ఆర్ ఆర్ ఆర్, కేజిఎఫ్ లు 100 రోజులు పూర్తి చేసుకోగా విక్రమ్ సినిమా 50 రోజులు పూర్తి చేసుకోని 100 రోజులకు దూసుకుపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: