ఈ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల కాబోయే సినిమాలు ఇవే..!

Pulgam Srinivas
ఈ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చాలా మూవీ లు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సందడి చేయబోతున్నాయి . అందులో ఎక్కువగా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమాలే ఉన్నాయి . మరి ఆ సినిమాలు ఏమిటి ... అవి ఏ తేదీన విడుదల కాబోతున్నాయో తెలుసుకుందాం .


అమీర్ ఖాన్ హీరోగా కరీనా కపూర్ హీరోయిన్ గా తెరకెక్కిన లాల్ సింగ్ చడ్డా మూవీ ని ఆగస్ట్ 11 వ తేదీన హిందీ తో పాటు తెలుగు లో కూడా విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని తెలుగు లో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తాడు. ఈ మూవీ లో టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాపై తెలుగు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలే పెట్టుకున్నారు. నిఖిల్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ ని ఆగస్ట్ 12 వ తేదీన విడుదల చేయనున్నారు. కార్తికేయ 2 సినిమా కొన్ని సంవత్సరాల క్రితం విడుదలైన కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కింది. ఇలా కొన్ని సంవత్సరాల క్రితం విడుదలై మంచి విజయం సాధించిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న కార్తికేయ 2 సినిమాపై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. నితిన్ హీరోగా క్యాథరిన్ , కృతి శెట్టి హీరోయిన్ లుగా , ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన మాచర్ల నియోజకవర్గం సినిమా ఆగస్ట్ 12 వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమాపై  ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. బెల్లంకొండ గణేష్ హీరోగా వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా తెరకెక్కిన స్వాతి ముత్యం సినిమా ఆగస్ట్ 13 వ తేదీన విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: