చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదు ఏ సినిమా తెచ్చింది?

Purushottham Vinay
తెలుగు సినీ పరిశ్రమలో స్వయంకృషితో ఎదిగిన నటుడు అంటే చిన్న పిల్లవాడు అడిగిన టక్కున మెగాస్టార్ చిరంజీవి అని చెబుతాడు. ఆ రేంజ్ క్రేజ్ ఇంకా ఐడెంటిటీ ఆయన సొంతం.తన స్వశక్తితో ఇండస్ట్రీని ఊపేసిన దీరుడు మెగాస్టార్ చిరంజీవి. అంతేకాదు మెగాస్టార్ బిరుదు అందుకుని తెలుగు ఇండస్ట్రీలో తన ప్రత్యేకతను చాటుకున్నాడు.అసలు చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదు రావడానికి కారకులు ఎవరు? ఆయనకు గాడ్ ఫాదర్ లాంటి దర్శకుడు ఇంకా నిర్మాత ఉన్నారు. వారి సహకారంతోనే చిరుకు ఆ గుర్తింపు దక్కింది. ఇక చిరంజీవిని మెగాస్టార్ ను చేసింది కూడా వారే కావడం గమనార్హం. చిరంజీవితో ఎందరో సినిమాలు చేసినా కూడా ఎక్కువ హిట్ చిత్రాలు తీసింది మాత్రం దర్శకుడు కోదండరామిరెడ్డి. ఆయన ప్రోద్బలంతోనే చిరంజీవి చాలా పెద్ద స్టార్ గా ఎదిగారు. ఆయన దర్శకత్వంలోనే చిరుకి ఎక్కువ హిట్లు వచ్చాయి.వీరి కలయికలో యండమూరి వీరేంద్రనాథ్ నవలల ఆధారంగా దాదాపు 12 సినిమాలు వచ్చాయి. అందులో అన్ని కూడా బ్రహ్మాండమైన చిత్రాలే.ఇక క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ అధినేత కేఎస్ రామారావు నిర్మాతగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా అభిలాష. ఇది కూడా సూపర్ డూపర్ హిట్. తరువాత వీరి కలయికలో వచ్చిన మరో చిత్రం వచ్చేసి రాక్షసుడు. ఇది కూడా టాలీవుడ్ రికార్డ్స్ ను బ్రేక్ చేసి పెద్ద హిట్ అయ్యింది.


ఇక ఇందులో నాగబాబు తొలిసారి నటుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమాతో చిరంజీవి రేంజ్ అసలు ఎక్కడకో వెళ్లిపోయింది.తరువాత వీరి ముగ్గురి కలయికలో వచ్చిన మరో సినిమా వచ్చేసి ఛాలెంజ్. ఇది కూడా చాలా బ్రహ్మాండమైన హిట్. చిన్న కథతో చాలా పెద్ద హిట్ సాధించారు. దీంతో ఇక చిరంజీవికి మరింత ఊపు వచ్చింది. ఇందులో విజయశాంతి ఇంకా సుహాసిని చిరంజీవికి జోడిగా నటించారు. వీరి ఆధ్వర్యంలో వచ్చిన మరో సినిమా మరణమృదంగం. ఈ సినిమాలోనే చిరంజీవి పేరు ముందు మెగాస్టార్ అనే బిరుదు చేర్చారు కేఎస్ రామారావు.చిరంజీవికి మెగాస్టార్ బిరుదు రావడానికి కారకులు కేఎస్ రామారావు. ఇలా చిరంజీవికి బ్యాక్ బోన్ గా నిలిచి ఆయనకు చాలా సక్సెస్ లు సాధించిన నిర్మాతగా ఆయన పేరు చిరస్థాయిగా నిలుస్తుంది. కానీ ఈ సినిమా కూడా ఒక ఫెయిల్ సినిమాగానే నిలిచింది. దీంతో మెగాస్టార్ గా పేరు తెచ్చినా సినిమా మాత్రం అంతగా సక్సెస్ కాకపోవడం విచిత్రమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: