'రాకెట్రీ' డిజిటల్ స్ట్రీమింగ్ తేదీ వచ్చేసింది... ఆ తేదీన... ఆ 'ఓటిటి' ఫ్లాట్ ఫామ్ లో..!

Pulgam Srinivas
నటుడు ఆర్ మాధవన్ గురించి కొత్తగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఆర్ మాధవన్ ఎన్నో మూవీ లలో హీరోగా , ఇతర పాత్రల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు  ను ఏర్పరుచుకున్నాడు. అలాంటి ఆర్ మాధవన్ తాజాగా రాకెట్రీ అనే మూవీ లో  ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ మూవీ ని కలర్‌ ఫిల్మ్స్‌, వర్ఘీస్‌ మూలన్‌ పిక్చరర్స్‌ పై సరితా మాధవన్‌, మాధవన్‌, వర్ఘీస్‌ మూలన్‌, విజయ్‌ మూలన్‌ నిర్మించారు. ఈ మూవీ లో సిమ్రన్‌ , సూర్య, గుల్షన్‌ గ్రోవర్‌, రజిత్‌ కపూర్‌, రవి రాఘవేంద్ర తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ మూవీ కి ఆర్ మాధవన్ రచన మరియు దర్శకత్వం వహించగా , శ్యామ్‌. సీఎస్‌ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా మంచి అంచనాల నడుమ 1 జూలై 2022 వ తేదీన విడుదల థియేటర్ లలో విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ టాక్ ను తెచ్చుకోవడంతో ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లను కూడా రాబట్టింది.

ఇలా బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో 'ఓ టి టి' లోకి రాబోతుంది. ఈ సినిమా  ప్రముఖ 'ఓ టి టి' సంస్థల్లో ఒకటైన అమెజాన్ ప్రైమ్ వీడియో లో జూలై 26 వ తేదీ నుండి తమిళ్ , తెలుగు , కన్నడ , మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ మూవీ ని ఎవరైనా థియేటర్ లలో చూద్దాము అని మీరు అయిన వారు ఉంటే  , జూలై 26 వ తేదీ నుండి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కాబోతుంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: