అక్షయ్ కుమార్ తో సమంత డాన్స్.. స్టంట్స్ చూస్తే షాకే?

praveen
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత నాగచైతన్య తో విడాకులు తరువాత  ఎక్కడ కనిపించినా కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోతుంది అన్న విషయం తెలిసిందే. చైతన్యతో విడాకుల తర్వాత సమంత డిప్రెషన్ లోకి వెళ్లిపోతుంది. ఇక కెరీర్ మొత్తం ముగిసి పోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో బాధ నుంచి బయటపడిన సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు టాలీవుడ్ లో మాత్రమే హవా నడిపించిన సమంత ఇప్పుడు బాలీవుడ్ లో కూడా చక్రం తిప్పేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే అందాల ఆరబోతతో కూడా ఎలాంటి లిమిట్స్ లేకుండా సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ ఫోటోలతో రచ్చ చేస్తూనే  ఉంది అన్న విషయం తెలిసిందే.

 ఇకపోతే ఇటీవలే బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ నిర్వహిస్తున్న కాఫీ విత్ కరణ్ అనే కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్తో కలిసి పాల్గొంది సమంత. ఈ సందర్భంగా కరణ్ జోహార్ అడిగిన పలు ప్రశ్నలకు సమంత  సమాధానాలు చెప్పింది. ఒకవేళ బెస్ట్ ఫ్రెండ్స్ బ్యాచిలర్ పార్టీ ని హోస్ట్ చేయాల్సి వస్తే బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తో డాన్స్ చేస్తా అంటూ చెప్పింది సమంత.. అయితే ఇక ఈ వీడియో చూసుకుంటే  సమంత షో లోకి ఎంట్రీ ఇస్తున్న సమయంలోనే అక్షయ్ కుమార్ సమంతను ఎత్తుకొని సీటు దగ్గరికి తీసుకు వచ్చి హంగామా చేశాడు.

 అంతేకాదు ఈ ప్రోమోలో చూసుకుంటే అటు సమంత అక్షయ్ కుమార్ తో కలిసి డాన్స్ చేసింది. ఈ క్రమంలోనే సమంతను గింగిరాలు తిప్పుతూ ఏకంగా అక్షయ్ కుమార్ డాన్స్ స్టంట్స్ చేశాడూ అని చెప్పాలి. కానీ ఒక సమయంలో సమంత ను ఏకంగా అక్షయ్ కుమార్  ఎత్తుకొని ప్రొఫెషనల్ డాన్సర్ చేసినట్లుగా స్టంట్ చేయడంతో ఇద్దరు కింద పడతారేమో అని అభిమానులు కూడా అనుకున్నారు.  ఇక ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోతూ ఉండగా.. విడాకుల తర్వాత సమంత తన లిమిటేషన్స్ ని పూర్తిగా చెరిపేసిందిఅంటూ కొంత మంది నెటిజన్లు కామెంట్ చేస్తూ ఉండటం గమనార్హంYour browser does not support HTML5 video..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: