లాఠీ సినిమా టీజర్ తో అదరగోడుతున్న విశాల్ ..!!

Divya

స్టార్ హీరో విశాల్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నారు హిట్ ప్లాట్లు సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తే బిజీ హీరోగా మారిపోయారు. ఎక్కువగా తమిళంలో యాక్షన్ సినిమాలు చేస్తూ వాటిని తెలుగులో డబ్ చేసి మంచి విజయాలు అందుకున్నారు ప్రస్తుతం విశాల్ కదా నాయకుడుగా డైరెక్టర్ వినోద్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం లాఠీ. ఈ సినిమాని హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కించడం జరుగుతుంది. ఈ సినిమాలో విశాల్ సరసన సునైన హీరోయిన్గా నటిస్తున్నది.

ఇటీవల షూటింగ్ సమయాలలో విశాల్ గాయపడడం కూడా జరుగుతూ వస్తోంది. ఫైట్ సన్నివేశాల కోసం భారీగా vfx వర్క్ కారణంగా ఈ సినిమా విడుదల తేదీని పోస్ట్ ఫోన్ చేస్తూ వస్తున్నారు ఆగస్టు 12వ తేదీన విడుదల కావాల్సి ఉండగా ఈ చిత్రం సెప్టెంబర్ 15కి పోస్టు పోన్ అవ్వడం జరిగింది.లాఠీ చిత్రం ఒకేసారి అన్ని భాషలలో విడుదల కానున్నది. అన్ని భాషలకు ఒకే టైటిల్ని నిర్ణయించడం జరిగింది సరికొత్త కదా అంశంతో డైరెక్టర్ వినోద్ కుమార్ ఈ సినిమాకి కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కించడం జరుగుతోంది.

లాఠీ సినిమాలు విశాల్ సమాజంలో ఎలాంటి మార్పులకు శ్రీకారం చుడుతారన్న విషయాన్ని తెర పైన చూడాల్సి ఉంటుంది ఈ చిత్రంలో విశాల్ పూర్తిస్థాయి యాక్షన్ హీరోగా నటించారు. ఇక ఈ సినిమా చివరిలో 45 నిమిషాల పాటు యాక్షన్ సన్నివేశాలు ఆకర్షణీయంగా నిలుస్తాయని చిత్ర బృందం తెలియజేస్తోంది. జులై 24వ తేదీన టీజర్ ని విడుదల చేయబోతున్నట్లు లాఠీ సినీ బృందం ప్రకటించింది. ఇక వాటికంటే ముందుగా ఫ్రీలుక్ టీజర్ తో అభిమానులకు ట్రీట్ ఇవ్వడం జరిగింది. వెయిట్ ఈజ్ ఓవర్ అనే క్యాప్స్ ఎంతో ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ కాస్త వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: