మరొకసారి ప్రేమలో పడ్డ స్టార్ హీరోయిన్..!!
దేవదాసు సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది గోవా బ్యూటీ ఇలియానా. ఆ తర్వాత పోకిరి, కిక్, జులాయి తదితర సినిమాలతో మంచి క్రేజ్ ను దక్కించుకుంది. ఆ తర్వాత బర్ఫీ చిత్రంతో మొదటిసారిగా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇలా తెలుగు హిందీ తమిళ్ కన్నడ వంటి భాషలలో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం అడపా దడప్ప సినిమాలలో నటిస్తూ ఉన్నది. ఇక అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు ఏదో ఒక వార్తలలో నిలుస్తూనే ఉంటుంది.
తరచూ తనకు సంబంధించిన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు తాజాగా మరొకసారి ప్రేమలో పడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక నిన్నటి రోజున కత్రినా కైఫ్ పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుపుకున్నది. ఈ వేడుకలో కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ కూడా హాజరు కావడం జరిగింది ఇక అక్కడికి ఇలియానా రావడంతో ఈమె అతనితో డేటింగ్ లో ఉందని వార్తలు కూడా బాలీవుడ్ మీడియాలో బాగా వినిపిస్తున్నాయి. కత్రినా కైఫ్ పుట్టినరోజులు వేడుకలలో తన భర్త విక్కీ హాజరు కావడంతో పాటు సెబాస్టియన్ తో తన కుటుంబ సభ్యులతో కలిసి మాల్దీవుల్లో కత్రినా కైఫ్ తన పుట్టినరోజును చాలా ఘనంగా జరుపుకుంది.