ఎన్ని ఫ్లాపులోచ్చిన తగ్గేదేలే అంటున్న యంగ్ హీరో?

Purushottham Vinay
ఎన్ని ఫ్లాపులోచ్చిన తగ్గేదేలే అంటున్న యంగ్ హీరో? ఇక టాలీవుడ్లో ప్రస్తుతం ఓ యువ కథానాయకుడు అయితే అసలు ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, ఇప్పటిదాకా నిఖార్సయిన హిట్టు ఒక్కటీ అందుకోకున్నా.. వరుసగా అవకాశాలు అందుకుని వేగంగా దూసుకెళ్తున్నాడు. ఇక ఆ హీరో ఎవరో కాదు. అతనే కిరణ్ అబ్బవరం.టాలీవుడ్ లో రాజావారు రాణివారు అనే చిన్న సినిమాతో ఇతను హీరోగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా థియేటర్లలో అయితే సరిగా ఆడలేదు. ఓటీటీలో మాత్రం ఈ సినిమా మంచి స్పందన తెచ్చుకుంది. అలాగే రెండో సినిమా ఎస్ఆర్ కళ్యాణమండపంకి బ్యాడ్ టాక్ వచ్చింది. ఐతే ఆ సినిమాకు మంచి ఓపెనింగ్స్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తారు సక్సెస్ ఫుల్ మూవీగా నిలిచింది. ఆపై సెబాస్టియన్ సినిమా అన్ని రకాలుగా కూడా నిరాశ పరిచింది. ఇటీవలే రిలీజైన సమ్మతమే బ్యాడ్ టాక్ ఇంకా ఓ మోస్తరు ఓపెనింగ్స్ తెచ్చుకుని వీకెండ్ తిరిగేసరికే చాప చుట్టేసింది.


ఇక ట్రాక్ రికార్డు ఇలా ఉన్నప్పటికీ.. ఇప్పుడు కిరణ్ అబ్బవరం పెద్ద పెద్ద బేనర్లలో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అయినా కూడా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.ఇంకా గీతా ఆర్ట్స్ బేనర్లో చేస్తున్న వినరో భాగ్యము విష్ణుకథ ఇంకా కోడి రామకృష్ణ తనయురాలు కోడి దివ్య నిర్మిస్తున్న నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమాలను చేస్తున్నాడు.ఇంకా అలాగే వీటితో పాటు మీటర్ ఇంకా రూల్స్ రంజన్ అనే రెండు కొత్త సినిమాలను ఈ రోజే ప్రకటించారు. ఇవి కాక యువి క్రియేషన్స్ బేనర్లో కూడా కిరణ్ ఓ సినిమా చేయబోతున్నాడు.అలాగే దాని గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. మొత్తానికి బ్యాగ్రౌండ్ ఇంకా అలాగే సక్సెస్ రేట్ రెండూ లేని హీరో నుంచి ఇన్ని సినిమాలు రాబోతుండటం కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: