నేట్ ఫ్లిక్స్ లో నెంబర్ వన్ గా కొనసాగుతున్న 'మేజర్' మూవీ..!

Pulgam Srinivas
టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేషు గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ క్షణం మూవీతో అడవి శేషు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఏర్పరుచుకున్నాడు. క్షణం మూవీ తర్వాత గూడచారి , ఎవరు సినిమాలలో హీరోగా నటించిన అడవి శేషు ఈ రెండు సినిమాలతో కూడా అదిరిపోయే విజయాలను అందుకొని హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏర్పరుచుకున్నాడు.
 

ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న అడవి శేషు తాజాగా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మేజర్ సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించగా శోభితా ధూళిపాళ ,సాయి మంజ్రేకర్ ఈ మూవీ లో కీలక పాత్రల్లో నటించారు. ప్రకాష్ రాజ్ ఈ మూవీ లో మరొక ముఖ్య పాత్రలో నటించాడు. ఈ సినిమాను జూన్ 3 వ తేదీన విడుదల అయ్యింది. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి షో కే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను వసూలు చేసి మంచి విజయాన్ని అందుకుంది. ఇలా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న మేజర్ సినిమా కొన్ని రోజుల క్రితం నుండే నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఈ సినిమా ప్రస్తుతం నేట్ ఫ్లిక్స్ లో కూడా ఫుల్ జోష్ ను చూపిస్తుంది. నేట్ ఫ్లిక్స్ తాజాగా తమ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో ఈ వారం  టాప్  10  లో ఉన్న సినిమాల లిస్ట్ ని విడుదల చేసింది. అందులో మేజర్ సినిమా హిందీ వర్షన్ మొదటి స్థానంలో కొనసాగుతుండగా, మేజర్ తెలుగు వర్షన్ మూడవ స్థానంలో కొనసాగుతోంది. ఇలా మేజర్ సినిమా 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో కూడా ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: