కళ్యాణ్ రామ్ కోసం రంగంలోకి దిగుతున్న ఎన్టీఆర్ బాలకృష్ణ..!!
రీసెంట్గా ఈ సినిమా విడుదల తేదీ పోస్టర్ ను కూడా చిత్ర బృందం ప్రకటించడం జరిగింది.బింబిసారా చిత్రం ఆగస్టు -5 న విడుదల చేయబోతున్నట్లు తెలియజేశారు ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ టీజర్ ఈ సినిమా పైన భారీగానే అంచనాలను పెంచేసాయి రీసెంట్గా వచ్చిన ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ లభించింది. త్వరలోనే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ అయిన వెంటనే కూడా చాలా గ్రాండ్గా నిర్వహించబోతున్నట్లు సమాచారం ఈమెరకు చిత్ర బృందం పలు సన్నహాలు చేస్తున్నారు.
ఈ మేరకు ఈవెంట్ కు ఎన్టీఆర్ బాలకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నారని వార్తలు కూడా వైరల్ గా మారుతున్నాయి బాలకృష్ణ ఎన్టీఆర్ ఒకే వేదికపై సందడి చేయడం జరుగుతోంది అనే వార్త తెలియగానే నందమూరి అభిమానులు చాలా సంబరపడిపోతున్నారు. బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు మహా నాయకుడు సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలకృష్ణ ఎన్టీఆర్ ని కలిసి కనిపించి అభిమానులను సైతం బాగా అలరించారు. ఇప్పుడు మరొకసారి బింబిసారా చిత్ర ఈవెంట్ లో ఎన్టీఆర్ బాలకృష్ణ కళ్యాణ్ రామ్ కలిసి సందడి చేయబోతున్నారు. మరి ఈ వార్తలలో నిజం ఎంతుందో అనే విషయం తెలియాలి అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.