అది కేవలం ప్రభాస్ నిర్ణయమే అంటున్న స్టార్ డైరెక్టర్..!!

Divya
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో డైరెక్టర్ కృష్ణవంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ సినిమాలకు పెట్టింది పేరు ఈయన. ఆయన తెరకెక్కించిన ఎన్నో చిత్రాలు కూడా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. ఆన్నే ప్లాపులు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. అలా కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన చిత్రం ఏదైనా ఉంది అంటే చక్రం అని చెప్పవచ్చు ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ చిత్రం గురించి కృష్ణవంశీ కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది వాటి గురించి చూద్దాం.

కృష్ణవంశీ మాట్లాడుతూ.. ప్రభాస్ తో ఏదైనా సినిమా చేయాలనుకున్నప్పుడు రెండు కథలు చెప్పాను. ఒక కథ రాయలసీమ నేపథ్యంలో గుప్త నిధుల చుట్టూ తిరిగేటువంటి కథ.. ఆ తర్వాత మరొకటి చక్రం సినిమా కథ అని తెలిపాడు. ప్రభాస్ చక్రం సినిమా ఎంచుకోవడానికి ఆసక్తి చూపించారు యాక్షన్ సినిమాలు ఎవరైనా చేయవచ్చు కానీ ఇలాంటి క్లాసికల్ టచ్ ఉన్న సినిమా మాత్రం నేను మీతోనే చేస్తానని తెలియజేశారట. అలా వారిద్దరి కాంబినేషన్లో చక్రం సినిమా సెట్స్ పైకి వెళ్లిందని తెలిపారు కృష్ణవంశీ. అయితే ఈ చిత్రం ప్లాప్ అయినప్పటికీ కూడా ఒక వర్గం ప్రేక్షకులు ఇప్పటికీ ఈ సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉంటున్నారు. అందుచేతనే అప్పట్లో ప్రభాస్ తీసుకున్న ఈ నిర్ణయం కరెక్టే అని భావించానని తెలిపాడు.
ఇక అప్పట్లో ప్రభాస్ కి చెప్పిన మరొక కథ కూడా వర్కౌట్ చేసే ఆలోచనలు ఉన్నట్లుగా తెలియజేశారు. అయితే తన పద్ధతిని ఎంతోమంది మార్చుకోమని చెప్పారట కానీ అలాంటి ఆలోచన తనకి తట్టలేదని తెలిపాడు. కమర్షియల్ సినిమా పేరుతో ట్రెండ్ పేరుతో నా అభిరుచిని వదులుకొని సినిమా చేయాలని తను అనుకోవడం లేదని తెలిపారు. ప్రస్తుతం రంగమార్తాండ సినిమా చేస్తున్న ఈ సినిమా అయిపోయిన వెంటనే అన్నం అనే ఒక సినిమా చేయబోతున్నాను అని తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: