'రంగమార్తాండ' మూవీ తర్వాత కృష్ణవంశీ వారి 'ఓటీటీ' ప్రాజెక్ట్..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రియేటివ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు కృష్ణవంశీ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కృష్ణవంశీ తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలకు దర్శకత్వం వహించి ఆ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో దర్శకుడిగా తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు.

అలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో అనేక వైవిధ్యమైన సినిమాలకు దర్శకత్వం వహించి తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న కృష్ణవంశీ గత కొద్ది కాలంగా మాత్రం బాక్సాఫీస్ దగ్గర విజయాలను అందుకోవడం చాలా వరకూ స్లో అయ్యాడు. చాలా సంవత్సరాల క్రితం చందమామ సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్న కృష్ణవంశీ ఆ తర్వాత గోపీచంద్ హీరోగా మొగుడు , రామ్ చరణ్ హీరోగా గోవిందుడు అందరివాడేలే , సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నక్షత్రం లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన ఈ సినిమాలు ఏవి కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించలేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కృష్ణవంశీ 'రంగమార్తాండ' అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

మరి కొన్ని రోజుల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కృష్ణ వంశీ కి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రంగమార్తాండ సినిమా పూర్తి అయిన తర్వాత కృష్ణవంశీ ఒక ప్రముఖ 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో ఒక ప్రాజెక్ట్ ను రూపొందించనున్నట్లు, కృష్ణవంశీ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో రూపొందించబోయే ప్రాజెక్ట్ 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: