కమల్ హాసన్ కి భారీ షాక్ ఇచ్చిన తమిళ నాడు ప్రభుత్వం..?

Anilkumar
సూపర్ స్టార్ అని అనుకుంటే సరిపోదు.ఆ పేరుకి తగట్టు ఉండాలి.ఇకపోతే గడిచిన కొంతకాలంగా తమిళ చిత్ర పరిశ్రమలో విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది.ఇక తోపు స్టార్లుగా పేరున్న అగ్ర కథానాయకుల సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఏ మాత్రం ప్రభావాన్ని చూపించలేకపోతున్నాయి.ఇక  దీంతో.. భారీ ఎత్తున నిర్మిస్తున్న వారి సినిమాలు ప్రచార హడావుడి తప్పించి.. ఎలాంటి ఫలితాన్ని ఇవ్వని పరిస్థితి.అయితే అగ్ర కథానాయకులకు సరైన సినిమా ఒక్కటి పడితే ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయన్న దానికి నిదర్శనంగా విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా చెప్పకనే చెప్పేసింది. ఇకపోతే ఒక మోస్తరు బ్యాంగ్ తో రిలీజ్ అయిన విశ్వ నటుడి సినిమా మీద పెద్దగా అంచనాల్లేవు.

కాగా  తెలుగులో అయితే.. పెద్దగా పట్టించుకున్నది లేదు.అయితే మూవీలో కంటెంట్ ఉండటం.. మౌత్ టాక్ తో కలెక్షన్ల జోరు పెరగటమే కాదు.. ఇదిలావుంటే ఇటీవల కాలంలో సైలెంట్ గా రిలీజ్ అయి.. రూ.400 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టిన మూవీగా విక్రమ్ నిలిచింది. ఇకపోతే చాలాకాలం వచ్చిన విజయంతో కమల్ హాసన్ చాలా హ్యాపీగా ఉన్నారు.ఇక  విజయానందాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇలాంటి వేళ.. కమల్ హాసన్ కు స్టాలిన్ సర్కారుతో షాక్ తప్పేట్లు లేదన్న వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే తాజాగా కమల్ హాసన్ నివాసాన్ని తమిళనాడులోని స్టాలిన్ సర్కారు స్వాధీనం చేసుకుంటుందన్న సమాచారం వినిపిస్తోంది.

 దీనికి సంబంధించిన నోటీసులు ఇప్పటికే వెళ్లాయని చెబుతున్నారు. ఇక ఇదంతా ఎందుకంటే.. వ్యక్తిగతంగా కానీ.. రాజకీయంగా కానీ కమల్ మీద కోపంతో చేయటం లేదని.. తప్పని పరిస్థితుల్లోనే చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటె ప్రస్తుతం చెన్నైలో రెండో దశ మెట్రోను నిర్మిస్తున్నారు.ఇక  ఇందులో భాగంగా అల్వార్ పేట స్టేషన్.. కమల్ ఇంటి మీదుగా వెళ్లనుంది.ఇకపోతే ఈ స్టేషన్ నిర్మాణం కోసం కమల్ హాసన్ ఇంట్లోని 170 చదరపు అడుగులు అవసరమవుతుందని..ఇక  ఈ స్థలం కోసమే కమల్ కు ప్రభుత్వం నోటీసులు పంపినట్లుగా చెబుతున్నారు.అయితే  మరి.. ప్రభుత్వం కోరినట్లుగా తన ఇంటి స్థలాన్ని ఇచ్చే విషయంలో కమల్ ఏం చెప్పనున్నారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.అయితే  కమల్ నివాసంలోనే ఆయనకు చెందిన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్..ఇక  ఆయనకు చెందిన మక్కల్ నీది మయ్యం పార్టీ ఆఫీసు ఉందన్న సంగతి తెలిసిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: