రామ్ పోతినేని 'ది వారియర్' మూవీ పై పెరుగుతున్న అంచనాలు..!

Pulgam Srinivas
టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు ఆయన రామ్ పోతినేని తాజాగా ది వారియర్ మూవీలో హీరోగా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాకు తమిళ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు పైన లింగుస్వామి దర్శకత్వం వహిస్తుండగా , అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి ఈ సినిమాలో రామ్ పోతినేని సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ సినిమాలో ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్రలో నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చాడు. ఇప్పటికే ది వారియర్ చిత్ర బృందం ఈ సినిమా నుండి కొన్ని పాటలను విడుదల చేయగా ఆ పాటలన్నింటికీ ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలోని బుల్లెట్ సాంగ్ విజిల్ సాంగ్ లకు యూట్యూబ్ లో అదిరిపోయే వ్యూస్ వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈ మూవీలోని బుల్లెట్ సాంగ్ ప్రస్తుతం  సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.  ఈ సినిమాలో రామ్ పోతినేని మొదటి సారి తన కెరీర్ లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండడంతో ఈ సినిమాపై మొదటి నుండి మంచి అంచనాలు నెలకొన్నాయి.  

కొన్ని రోజుల క్రితం చిత్ర బృందం విడుదల చేసిన ఈ సినిమా టీజర్ లో రామ్ పోతినేని తన మాస్ మేనరిజంతో , డైలాగ్ లతో అదరగొట్టాడు.  తాజాగా చిత్ర బృంద విడుదల చేసిన ట్రైలర్ లో కూడా రామ్ పోతినేని మాస్ డైలాగ్ లతో ,  అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో అదరగొట్టాడు. ఇలా ఇప్పటి వరకు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ లు ,  టీజర్ , ట్రైలర్ , పాటలు అన్ని కూడా అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ సినిమాపై సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా జూలై 14 వ తేదిన విడుదల కాబోతుంది. మరి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: