పవన్ కి పరిటాల రవి నిజంగా గుండు కొట్టించాడా?

Purushottham Vinay
ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో తారా స్థాయిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే. అయితే చాలా సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ కు పరిటాల రవి గుండు కొట్టించారని వార్తలు అప్పుడు తెగ వైరల్ అయ్యాయి.అయితే వైరల్ అయిన వార్తలను చాలామంది కూడా అప్పుడు నిజమేనని నమ్మారు. అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు పరిటాల రవి కానీ ఈ వివాదం గురించి అప్పట్లో నోరు విప్పకపోవడంతో వైరల్ అయిన వార్త నిజమో కాదో అభిమానులకు కూడా అసలు అర్థం కాలేదు.అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ మొదలైంది. ఖుషి సినిమా వరకు పవన్ కళ్యాణ్ నటించిన వరుస సినిమాలు అన్నీ కూడా ఘన విజయాలను సొంతం చేసుకున్నాయి. అయితే రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన శేషు సినిమాలో నటించే అవకాశం మొదట పవన్ కు దక్కిందని బోగట్టా. ఆ సినిమా స్క్రీన్ టెస్ట్ కొరకు అప్పట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గుండు కొట్టించుకోవడం జరిగింది.


అయితే పవన్ కళ్యాణ్ గుండుతో కనిపించడం కొన్ని పత్రికల్లో ఇంకా అలాగే వెబ్ సైట్లలో తప్పుడు కథనాలు ప్రచారంలోకి రావడంతో పవన్ కళ్యాణ్ గురించి ఫేక్ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. పరిటాల సునీత సైతం ఒక సందర్భంలో పరిటాల రవికి పవన్ కళ్యాణ్ కు పరిచయం లేదని కూడా వెల్లడించడం గమనార్హం. పరిటాల సునీత ఇచ్చిన క్లారిటీ వల్ల వైరల్ అయిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని కూడా తేలిపోయింది.ఇక వైరల్ అయిన గాసిప్స్ ను చాలామంది కూడా నిజమని నమ్మడంతో ఇలాంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్ లో హరిహర వీరమల్లు సినిమాతో పాటు పలు రీమేక్ సినిమాలలో నటిస్తున్నారు.ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమాలు పవన్ కు సక్సెస్ ను అందిస్తాయో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: