నేను రొమాన్స్ చేయలేను : మాధవన్

praveen
ఇటీవలి కాలంలో జూనియర్ హీరోలతో పాటు సీనియర్ హీరోలు సైతం తగ్గేదే లేదు అంటున్నారు. సినిమాల విషయంలో యువ హీరోలతో పోటీ పడుతున్నారు. 60 ఏళ్ళ వయసులో కూడా ఫుల్ స్పీడ్ తో సినిమాలు చేస్తూ అటు ప్రేక్షకులను అలరిస్తున్నారు అని చెప్పాలి. అయితే ఇటీవలి కాలంలో సీనియర్ హీరోలు 60 ఏళ్లు దాటిన తర్వాత కూడా కుర్ర హీరోయిన్లతో రొమాన్స్ చేయడానికి ఎక్కడ వెనకడుగు వేయడం లేదు అని చెప్పాలి. అందమైన కథానాయకలను  సినిమాలో పెట్టుకోవడం వారితో కాస్త ఎక్కువగానే రొమాన్స్ లు చేయడం లాంటివి చేస్తున్నారు. కొంతమంది హీరోలు అయితే మితిమీరిన రొమాన్స్ లతో ప్రేక్షకులను చిరాకు తెప్పిస్తున్నారు అని చెప్పాలి.

 ఇలా కొంతమంది హీరోలు చేస్తున్న సినిమాలతో వీళ్ళ వయస్సు ఏంటి వీళ్ళు చేస్తున్న సినిమా ఏంటి కాస్త పద్ధతి అయిన సినిమాలు చేస్తే బాగుంటుంది కదా అని  ప్రేక్షకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని టాక్ కూడా ఉంది. అయితే ఇటీవల ఇదే విషయంపై కోలీవుడ్ హీరో మాధవన్ స్పందించాడు. సినిమా నటులు వయస్సుకు తగ్గ పాత్రలు చేస్తేనే బాగుంటుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు  ప్రస్తుతం తన వయసు దృశ్య హీరోయిన్లతో రొమాన్స్ చేయడం తనకు అస్సలు ఇష్టం లేదు అంటూ మనసులో మాట బయట పెట్టాడు మాధవన్.

 ఒకవేళ తన వద్దకు రొమాంటిక్ ఫిలిం ఆఫర్ వస్తే.. ఇక ఇది నా వయసు కు తగ్గిందిగా ఉందా లేదా అన్న విషయాన్ని ముందుగా పరిగణలోకి తీసుకుంటాను. అంతే కాకుండా సినిమాల్లో మంచి కంటెంట్ ఉంటేనే సినిమాకు ఒప్పుకుంటాను అంటూ మాధవన్ చెప్పుకొచ్చాడు. కాగా ప్రస్తుతం వెండితెరపై సినిమాలతో పాటు ఓటిటి వేదికగా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నాడు మాధవన్. ఇకపోతే ఇటీవలే మాధవన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన రాకెట్రీ అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా మాజీ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: