కిరణ్ అబ్బవరం ఆ హీరోలలాగే అయిపోతాడా ?

VAMSI
ప్రస్తుతం టాలీవుడ్ లో చక్రం తిప్పుతున్న బిజీ యంగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం కూడా ఒకరు. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ ను అందుకుని అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్న ఈ హీరో మొదట షార్ట్స్ ఫిల్మ్స్ తో గుర్తింపు పొందాడు. అలా షార్ట్స్ ఫిల్మ్స్ నుండి వెండి తెరపై మెరిసి వరుస హిట్ లతో జోరు పెంచాడు. రాజావారు - రాణిగారు , ఎస్సార్ కల్యాణ మండపం వంటి వరుస విజయాలతో ప్రముఖ నిర్మాతల కళ్ళల్లో పడ్డాడు. ఇంకేముంది వరుస పెట్టి స్టార్ నిర్మాతలు పిలిచి మరి అవకాశాలు ఇచ్చి తమ సినిమాలకు కిరణ్ అబ్బవరం ను లాక్ చేసుకున్నారు. అయితే సినీ పరిశ్రమ అన్నాక ఒడిదుడుకులు సహజమే.. అలాగే ఈ హీరోకి కూడా మొదటి రెండు సినిమాలు ప్లస్ అవ్వగా ఆ తరవాత  సెబాస్టియన్ PC 524’ పరాజయం పాలయ్యింది.
ఇక ఇపుడేమో తాజాగా ఈ హీరో నుండి వచ్చిన 'సమ్మతమే' సినిమా కూడా నెగిటివ్ టాక్ ను మూటగట్టుకుంది. కానీ ఈ యంగ్ హీరో చేతిలో ఇంకా బడా నిర్మాతల ప్రాజెక్టులు చాలానే ఉన్నాయి. అయితే అవి హిట్ అయితే కిరణ్ అబ్బవరం హీరో రేంజ్ వేరే లెవల్ లో ఉంటుంది. లేదంటే కెరియర్ గాడి తప్పే ప్రమాదం ఉందని అంటున్నారు.
కిరణ్ అబ్బవరం నుండి రాబోయే తదుపరి చిత్రం  ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’. ఆ తర్వాత  వరుసలో గీతా ఆర్ట్స్ తీస్తున్న ‘వినరో భాగ్యము విష్ణు కథ’. ఉంది. దీని తరవాత  మైత్రీ మూవీ మేకర్స్, ఏఎం రత్నం సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి.
కానీ చాలా మంది యంగ్ హీరోలలాగే ఇతని భవిష్యత్తు కూడా ఏమవుతుంది అని అంతా కంగారు పడుతున్నారు. మొదటి రెండు మూడు సినిమాలు హిట్ అవ్వడం.. ఆ తరువాత వరుస ప్లాప్ లతో కనుమరుగైపోయిన హీరోలు చాలా మందే ఉన్నారు. మరి మన కుర్రాడు కిరణ్ అబ్బవరం పరిస్థితి ఏమవుతుందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: