అభిమానుల కోసం గట్టిగా ప్లాన్ చేస్తున్న రామ్.. సక్సెస్ అవుతాడా..?

Divya
పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఇస్మార్ట్ శంకర్ సినిమా ద్వారా మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ ఈసారి తాజాగా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ది వారియర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఇక మాస్ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ ఎన్. లింగుస్వామి ఈ చిత్రానికి దర్శకుడిగా పని చేస్తున్నారు ఇక కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం. ఇకపోతే ఈ సినిమా రిలీజ్ కి సిద్ధమవుతున్న నేపథ్యంలో చిత్రబృందం వేగంగా ప్రమోషన్స్ ను మొదలుపెట్టింది.ఈ సినిమా నుంచి రామ్ , కృతి శెట్టి లపై చిత్రీకరించిన బుల్లెట్ బండి లిరికల్ వీడియో సాంగ్ నెట్టింట బాగా వైరల్ గా మారిన విషయం తెలిసిందే .ఇక మిలియన్ వ్యూస్ రాబడుతూ ట్రెండ్ అవుతూ రికార్డులు సృష్టిస్తోంది.
ఇక ఈ నేపథ్యంలోనే బుధవారం విజిల్ సాంగ్ లిరికల్ వీడియోను కూడా విడుదల చేసి  మంచి వ్యూస్ ను సొంతం చేసుకుంటుంది. అయితే ఈ వీడియోను హీరో సూర్య సోషల్ మీడియా వేదికగా విడుదల చేసినట్లు సమాచారం. ఇకపోతే రామ్ తో కృతి శెట్టి మ్యాచ్ చేసేందుకు ప్రయత్నం చేసింది. ఇదిలా ఉండగా ఈ సాంగ్ ను  బుధవారం ఏ ఎం బి సినిమాస్ లో విడుదల చేయడం జరిగింది. ఇక ఈ ఈవెంట్ కి హీరో రామ్ తో పాటు కృతి శెట్టి డైరెక్టర్ లింగుస్వామి అలాగే నిర్మాత శ్రీనివాస చిట్టూరి కూడా హాజరయ్యారు.

ఇక ఈ సందర్భంగా హీరో రామ్ మాట్లాడుతూ నా గత మూవీ ని 50% ఆక్యుపెన్సీ లో మాత్రమే చూశాను. ఇక ఈ రోజు థియేటర్లో 100% ఆక్యుపెన్సీ చూస్తుంటే చాలా మంచి ఫీలింగ్ వస్తుంది.. ఇప్పుడే లాక్ డౌన్  తీసినట్టు అనిపిస్తుంది. విజిల్ వేసే బాధ్యత మీది.. ఆ విజిల్ వేయించే బాధ్యత మాది.. ముఖ్యంగా మై డియర్ ఫ్యాన్స్ ఈ సినిమాలో మీ కోసం చాలా పెట్టాము. డైరెక్టర్ని అడిగి మరీ కావలసినవి పెట్టించాను అని హీరో రామ్ చెప్పుకొచ్చారు ఇకపోతే ఈ సినిమా తో అభిమానుల కోసం రామ్ చాలా గట్టిగానే ప్లాన్ చేశాడని కనిపిస్తోంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో విజయం సాధిస్తుందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: