ఆ సినిమా కోసం ఒక్క రూపాయి రెమ్యునరేషన్ తీసుకోని షారుక్, సూర్య..?

Anilkumar
తాజాగా తమిళ స్టార్ హీరో మాధవన్ స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం రాకెట్రీ.ఇకపోతే ఈ సినిమా గురించి గత కొన్నాళ్లు గా మీడియాలో వార్తలు వస్తున్నాయి.అయితే ఈ సినిమా  నంబి నారాయన్ అనే శాస్త్రవేత్త జీవిత కథ ఆధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారట దర్శకుడు  మాధవన్ స్వీయ .కాగా ఈ సినిమా జూలై 1వ తారీకున విడుదలకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం వినబడుతుంది.ఇక ఇదిలావుంటే తాజాగా ఇప్పుడు ఈ సినిమా కోసం మాధవన్ పడ్డ కష్టం గురించి తమిళ మీడియా చాలా గొప్పగా  చెబుతోంది.ఇకపోతే తాజాగా మాధవన్ ప్రయత్నం ను ప్రతి ఒక్కరు స్వాగతిస్తున్నారు.

అంతేకాక  ఆయన స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం పలువురు స్టార్స్ మేము సైతం అన్నట్లుగా తమ వంతు సహాయం మరియు సహకారం ను అందించేందుకు ముందుకు వస్తున్నట్టు తెలుస్తోంది. అయితే దేశం మొత్తం నంబి నారాయణ గురించి తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది.ఇకపోతే ఆయన గురించి జనాలకు చెప్పే సినిమా కోసం తమ వంతు సహకారం అన్నట్లుగా బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ మరియు తమిళ సూపర్ స్టార్ హీరో సూర్య లు పారితోషికం తీసుకోకుండా నటించడం జరిగింది.

ఇకపోతే ఈ సినిమా లో వీరిద్దరు కీలకమైన గెస్ట్ రోల్స్ లో కనిపించబోతున్నారట.కాకా ఈ సినిమాలో వీరు నటించిన ఈ  రెండు పాత్రలు కూడా సినిమా లో కథకు అత్యంత కీలకంగా ఉంటాయట.అయితే ఇక ఈ పాత్రల ప్రాముఖ్యత దృష్ట్యా సినిమా లో వారిద్దరిని నటింపజేసినట్లుగా యూనిట్ సభ్యులు చెబుతున్నారు.కాగా  మాధవన్ చేస్తున్న ఈ గొప్ప బయోపిక్ కు తమవంతు సహకారం అన్నట్లుగా వీరు ఏమాత్రం పారితోషికం తీసుకోకుండా నటించారట.ఇక ఇదిలావుంటే ఈ ఇద్దరు కూడా పారితోషికం తిరస్కరించినట్లు తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అయితే మాధవన్ వారిద్దరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిజేస్తున్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: