షూటింగ్ లో ప్రమాదం.. ఇద్దరు హీరోల మృతి?

praveen
సాధారణంగా సినిమా హీరోలు ప్రేక్షకులను అలరించేందుకు కొన్నిసార్లు రిస్క్ చేయడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. సన్నివేశాలు మరింత రియలిస్టిక్గా వచ్చేందుకు డూప్ లేకుండా రిస్క్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు హీరోలు గాయపడటం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఇద్దరు హీరోలు ఇలాంటిదే చేయబోయి చివరికి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా  మారిపోయింది.

 సాధారణంగా యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్న సమయంలో చిన్నచిన్న ప్రమాదాలు జరగడం కామన్. కానీ ఇక్కడ మాత్రం ఇలాంటి ప్రమాదం ఇద్దరు హీరోల  ప్రాణం తీసింది. గతంలో భారతీయుడు-2 సినిమా షూటింగ్ సెట్ లో జరిగిన ప్రమాదం.. ప్రమాదంలో జరిగిన ప్రాణ నష్టం గురించి అందరికీ గుర్తుండే ఉంటుంది . ఇప్పుడు ఇలాంటి ప్రమాదమే మెక్సికోలోని బాజా కాలిఫోర్నియా లోని  ద్వీపకల్పంలో జరిగింది. ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ తెరకెక్కిస్తున్న  ఒరిజినల్ సిరీస్ 'ది చూసేన్ వన్'  సిరీస్ 2019 లో రిలీజ్ అయిన మంచి విజయాన్ని అందుకుంది.

 ఇక ఈ సీజన్కు సంబంధించి వరుసగా సీజన్ లను రిలీజ్ చేస్తూ వస్తుంది నెట్ ఫ్లిక్స్. ఇటీవలే మూడో సీజన్ మొదలుపెట్టారు. బాజా కాలిఫోర్నియా సమీపంలోని శాంటా రోసాల్య ఎడారి ప్రాంతంలో షూటింగ్ చేస్తున్న సమయంలో పక్కనే ఒక రోడ్డు ఉంది. అయితే ఎడారి ప్రాంతంలో రోడ్డుపై వెళ్తున్న వ్యాన్ పల్టీలు కొడుతూ షూటింగ్ స్పాట్ లోకి దూసుకెళ్లింది. దీంతో ఇక ఆ సెట్ లో ఉన్న నటులు రేముండో గుర్దానో, జువాన్ ఫ్రాన్సిస్కో తో పాటు మరో ఆరుగురు పై పడింది. ఈ ఘటనలో ఇద్దరు నటులు మృత్యువాత పడ్డారు. ఇతరులకు  గాయాలయ్యాయి. ఈ ఘటనతో అభిమానులు ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: