మహేష్ బాబు సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ప్రియాంక అరుల్ మోహన్..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ ప్రియాంక అరుల్ మోహన్ గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటి వరకు తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే ప్రియాంక అరుల్ మోహన్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి నాని హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన నానిస్ గ్యాంగ్ లీడర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

ఈ సినిమా ప్రియాంక అరుణ్ మోహన్ కు తెలుగు బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని తెచ్చి పెట్టలేకపోయింది. ఆ తర్వాత శ్రీకారం సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర ప్రియాంక అరుల్ మోహన్ కు నిరాశనే మిగిల్చింది. ఇలా తెలుగులో ఈ ముద్దుగుమ్మకు ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ విజయం లేకపోయినా తెలుగు స్టార్ హీరోలలో ఒకరు అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో ఈ ముద్దుగుమ్మకు అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.  మహేష్ బాబు,  త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించబోతోంది అని ఇన్ని రోజులుగా వార్తలు వచ్చాయి.

కాకపోతే ప్రస్తుతం పూజా హెగ్డే ను ఈ సినిమా నుండి తప్పించినట్లు, ఆ స్థానంలో ప్రియాంక అరుల్ మోహన్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒక వేళ ఈ వార్త కనుక నిజం అయితే ప్రియాంక అరుల్ మోహన్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా ఫుల్ క్రేజీ హీరోయిన్ గా మారిపోవడం ఖాయం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇది ఇలా ఉంటే తెలుగులో ప్రియాంక అరుల్ మోహన్ కు పెద్దగా విజయాలు లేకపోయినా తమిళంలో మాత్రం ప్రియాంక అరుల్ మోహన్ కి డాక్టర్ , డాన్ వంటి మంచి విజయవంతమైన సినిమాల్లో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: