కొత్త సినిమా షూటింగ్ ను ప్రారంభించిన కళ్యాణ్ రామ్..!

Pulgam Srinivas
టాలీవుడ్ హీరో కళ్యాణ్ రామ్ గురించి కొత్తగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కళ్యాణ్ రామ్ హిట్ , ప్లాప్ లతో ఏమాత్రం సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా కళ్యాణ్ రామ్ తన కెరియర్ లో అతనొక్కడే, హరేరామ్ ,పటాస్ , 118 వంటి మంచి విజయవంతమైన సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకున్నాడు.

ఇలా హీరోగా మాత్రమే కాకుండా కళ్యాణ్ రామ్ ఎన్నో సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏర్పరచుకున్నాడు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్,  ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాకు,  ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇలా హీరోగా , నిర్మాతగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్న కళ్యాణ్ రామ్ ప్రస్తుతం బింబిసార సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు. ఈ సినిమా ఆగస్ట్ 5 వ తేదీన విడుదల కాబోతుంది.

ఇలా బింబిసార సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్న కళ్యాణ్ రామ్ తాజా గా తన కొత్త సినిమా షూటింగ్ ను ప్రారంభించాడు. కళ్యాణ్ రామ్ 'డెవిల్' అనే సినిమాలో హీరో గా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర బృందం ఎప్పుడు విడుదల చేసింది. చిత్ర బృందం విడుదల చేసిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కు విపరీతమైన ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా కళ్యాణ్ రామ్ 'డెవిల్' సినిమా షూటింగ్  ను తాజాగా ప్రారంభించాడు. డెవిల్ సినిమా 1940 కాలంలో జరిగే కథతో తెరకెక్కబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: