'బింబిసార' మూవీ నిండి కొత్త పోస్టర్... రెండు డిఫరెంట్ లుక్ లలో అదరగొడుతున్న కళ్యాణ్ రామ్..!

Pulgam Srinivas
నందమూరి కళ్యాణ్ రామ్ గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతనొక్కడే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి విజయం అందుకొని ,  ఆ తర్వాత హరే రామ్, పటాస్ , 118 వంటి విజయవంతమైన సినిమా లతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో తన కంటూ ఒక సపరేట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న కళ్యాణ్ రామ్ ప్రస్తుతం బింబిసార మూవీ లో హీరోగా నటిస్తున్నాడు .

 బింబిసార మూవీ కళ్యాణ్ రామ్ కు కెరియర్ పరంగా 18 వ సినిమా. ఈ మూవీ లో కళ్యాణ్ రామ్ సరసన కేథరిన్‌, సంయుక్త మీనన్‌, వారీనా హుసేన్‌ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ సినిమా కు విశిస్ట్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ తో విశిస్ట్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ మూవీ ని నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై హరికృష‍్ణ. కె నిర‍్మిస్తున్నడు.  ఈ  మూవీ కి  'ఏ టైమ్‌ ట్రావెల్‌ ఫ్రమ్‌ ఈవిల్‌ టు గుడ్‌' అనేది ట్యాగ్‌ లైన్‌. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా టీజర్ ను చిత్ర బృందం విడుదల చేయగా ఈ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పా న్స్ లభించింది.

 ఇది ఇలా ఉంటే తాజాగా బింబిసార చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ ను విడుదల చేసింది. తాజా గా ఈ చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ లో ఈ మూవీ ని ఆగస్టు 5 వ తేదీన  విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం  అనౌన్స్మెంట్ చేసింది. అలాగే చిత్రబృందం తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో కళ్యాణ్ రామ్ రెండు డిఫరెంట్ లుక్ లలో కనబడుతున్నాడు. మరి ఈ మూవీతో కళ్యాణ్ రామ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: