టీజర్: జ్వాలా సినిమా నుంచి డిగ్లామర్ టీజర్ రిలీజ్..!!

Divya
బిచ్చగాడు సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకున్నాడు విజయ్ ఆంటోని. ఇక సాహో సినిమా తో మంచి పేరు తెచ్చుకున్నాడు అరుణ్ విజయ్. తాజాగా వీరిద్దరూ కలసి నటిస్తున్న చిత్రం జ్వాల.. ఈ యాక్షన్ థ్రిల్లర్ ను పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకుల బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇద్దరు నటులు కూడా విలక్షణమైన నటనను ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో జ్వాలా సినిమా టీజర్ కూడా విడుదల చేయడం జరిగింది. వాటి గురించి చూద్దాం.
హ్యాండ్సమ్ హంక్ రానా  దగ్గుబాటి ద్వారా టీజర్ను విడుదల చేయడం జరిగింది. పాత రోమ్ నగరం గుర్తుందా.. మిత్రుడా అనే డైలాగ్ నుంచి ఈ సినిమా టీజర్ మొదలవుతుంది. ఇద్దరు విజయ్ లు కూడా డి గ్లామర్ తో కనిపించనున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ తో హాలీవుడ్ స్థాయిలో గ్రాండ్ విజువల్స్ తో కూడిన బాగా ఆకట్టుకుంటోంది. విభిన్నమైన గెటప్పుల్లో ఉన్న అరుణ్ విజయ్-విజయ్ ఆంటోని ఇద్దరూ కూడా పోటీపడి నటించే లాగా కనిపిస్తున్నారు. ఇందులో అక్షరహాసన్ కీలక పాత్రలో నటిస్తున్నది. ప్రకాష్ రాజ్, నాజర్ వంటి వారు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.

భారీ బడ్జెట్తో అత్యున్నత సాంకేతిక తో భారీ స్థాయిలో జోల చిత్రాన్ని రూపొందించినట్లు గా కనిపిస్తోంది. ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగా అదిరిపోయేలా కనిపిస్తోంది. ఈ చిత్రంలో సన్నివేశాలను స్విజర్లాండ్ , కజకిస్థాన్, రష్యా, కలకత్తా వంటి దేశాలలో ఈ సినిమా షూటింగ్ చేసినట్లుగా తెలుస్తోంది.. మొత్తానికి అద్భుతమైన విజువల్స్ తో ఈ సినిమా యాక్షన్ ప్యాక్డ్ టీచర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేస్తోంది. జ్వాల సినిమాని నవీన్ దర్శకత్వం వహిస్తున్నారు. అమ్మ క్రియేషన్, శివ సమర్పణలో ఈ సినిమాని రామాంజనేయులు నిర్మించడం జరుగుతోంది. ఇక ఈ చిత్రం కూడా పాన్ ఇండియా లెవల్లో యాక్షన్ థ్రిల్లర్ వంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: