డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ కుమారుడికి క్లీన్ చిట్..!!

Divya
బాలీవుడ్ లో ఎన్నో సంవత్సరాలుగా తన హవా కొనసాగిస్తూనే ఉన్నాడు హీరో షారుక్ ఖాన్..బాలీవుడ్లో స్టార్ హీరోగా పేరు పొందిన షారుక్ ఖాన్ తన కుమారుడు ఆర్యన్ ఖాన్ ను కూడా హీరోగా పరిచయం చేయాలనుకున్నాడు.. కానీ గత సంవత్సరం ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో  ఇరుక్కోవడం ఇప్పుడు తాజాగా మరొకసారి తెరపైకి రావడం జరిగింది. ఆర్యన్ ఖాన్ పై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో చార్జిషీట్ ను కోర్టులో ప్రవేశ పెట్టడం జరిగింది. కాసేపట్లో అది సస్పెన్స్ కోర్టులో డిపార్ట్మెంట్ ముందు దాఖలు చేయబడుతోంది. NDPS కోర్టు ప్రస్తుతం సెలవులో ఉంది కాబట్టి.. తదుపరి విచారణ తర్వాత చేయబడుతుంది. ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ ను అరెస్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే..
గతంలో క్రూయిజ్ డ్రగ్స్ కేసులో  బీ టౌన్ ఇండస్ట్రీలో ఈ పేరు సంచనలం గా మారిపోయింది. ఈ కేసులో భాగంగా ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్ ఇచ్చినట్లు గా సమాచారం. ఆర్యన్ ఖాన్ అమాయకుడని, అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని NCB అధికారులు తెలియజేశారు. దీంతో షారుక్ ఖాన్ అభిమానులు కాస్త ఊపిరిపీల్చుకున్నారు అని చెప్పవచ్చు. మరి ఈసారి షారుక్ ఖాన్ తన కుమారుడిని హీరోగా ఆయన పరిచయం చేస్తారేమో చూడాలి.

ఇకపోతే షారుక్ ఖాన్ లాంటి ఎంతో మంది తండ్రులు తమ వారసులను ఇండస్ట్రీలోకి పరిచయం చేయాలని కలలు కంటూ ఉంటారు అందులో కొంతమంది కలలను నిజం చేసుకుంటే మరికొంతమంది ఆ కలలను సాకారం చేసుకోవడానికి చివరి వరకు ప్రయత్నం చేస్తూ విఫలమైన వారు కూడా చాలామంది ఉన్నారు. ఇకపోతే ఇప్పటికే షారుక్ ఖాన్ ఆర్యన్ ఖాన్ నటన ప్రావీణ్యం పొందాడు అందుకే త్వరలోనే హీరోగా పరిచయం చేయాలని అనుకుంటున్నాడు హీరోగా పరిచయం చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం ఈ విషయంపై షారుఖాన్ అభిమానులలో ఆందోళనను కలిగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: