ఘాటైనా అందాలతో రెచ్చగొడుతున్న రకుల్...!!

murali krishna
తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు గ్లామరస్ బ్యూటీగా స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేసిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లో బాగా బిజీగా మారిపోయింది.

తెలుగులో ఈ బ్యూటీ గతకొంతకాలంగా అపజయాలతో చేదు అనుభవాలనే ఎదుర్కొంటోంది. అయినప్పటికీ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా మళ్ళీ తెలుగులో కూడా అవకాశాలు వస్తే చేయడానికి వెనుకడుగు వేయడం లేదట.. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో గ్లామరస్ అందాలతో కూడా అందరికి షాక్ ఇస్తోంది. ఇటీవల ఆమె పోస్ట్ చేసిన మరొక ఫోటో కూడా ఫాలోవర్స్ ను ఎంతగానో ఎట్రాక్ట్ చేసిందట.ఆ వివరాల్లోకి వెళితే..

 
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపును అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత పెద్ద హీరోలతో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళింది.. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం కన్నడ చిత్ర పరిశ్రమలో కూడా కొన్ని సినిమాల్లో ఆమె నటించింది. ఇక టాలీవుడ్ లో మాత్రం ఆమె ప్రతి ఏడాది ఏదో ఒక సినిమా తో ఆడియన్స్ ను పలకరించే ప్రయత్నం అయితే చేస్తోంది.


 

ఈ మధ్యకాలంలో రకుల్ ప్రీత్ సింగ్ నాన్నకు ప్రేమతో, సరైనోడు, దృవ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకుని మిగతా హీరోయిన్స్ కు కూడా గట్టి పోటీనే ఇచ్చింది. అప్పట్లో ఈ బ్యూటీ పారితోషకం కూడా ఒక్కసారిగా పెరిగుతూపోయింది. అయితే ఆ క్రేజ్ ను రకుల్ ఎక్కువ రోజులు కొనసాగించ లేక పోయిందట.


 

కొన్ని సార్లు వరుసగా విజయాలను అందుకుంటున్న రకుల్ మరి కొంత కాలం తర్వాత వరుసగా డిజాస్టర్స్ చూడాల్సి వస్తోందిట.ముఖ్యంగా ఈ బ్యూటీ కెరీర్ లో చేసిన కొన్ని పెద్ద సినిమాలు ఊహించని విధంగా చేదు అనుభవాలను మిగిల్చాయి అందులో మహేష్ బాబు స్పైడర్ మరియు నాగార్జున మన్మధుడు సినిమాలు బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచాయని తెలుస్తుంది.

 

ఏది ఏమైనా రకుల్ సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా తన కెరీర్ ను ఒక లెవల్ లో జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తోందట.. ఇక బాలీవుడ్ లో ప్రస్తుతం ఎంతో బిజీగా మారిపోయింది. కాకపోతే అక్కడ కూడా మళ్ళీ ఆమె సినిమాలు ప్లాప్ అవుతున్నాయట. రీసెంట్ గా వచ్చిన ఎటాక్, రన్ వే సినిమాలతో ఊహించని విధంగా మరో రెండు డిజాస్టర్స్ ను ఆమె ఎదుర్కొంది.


 

ఇక సినిమాల సంగతి పక్కన పెడితే రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం తన గ్లామర్ తో నిత్యం ఏదో ఒక విధంగా అందరిని ఆకట్టుకుంటూనే ఉంది. రీసెంట్ గా హలో మ్యాగజైన్ కోసం స్పెషల్ ఫోటోషూట్ నిర్వహించిన రకుల్ అందులో చొక్కా గుండెలను తీసేసినట్లుగా అతి చిన్న నిక్కరులో నెటిజన్లకు బాగా షాక్ ఇచ్చింది. ఒక విధంగా గతంలో వేసిన బికినీ కంటే కూడా ఇది చాలా అందంగా ఉంది అని అందరూ పాజిటివ్ గా స్పందిస్తున్నారు.


 

ఇక ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ఆమె చేతిలో హిందీ తెలుగు తమిళ్ సినిమాలు గట్టిగానే ఉన్నాయట.. హిందీలో డాక్టర్ జి సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా తమిళంలో ఇటీవలే ఒక సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. తెలుగు తమిళంలో ఒకేసారి తెరకెక్కుతున్న '31 అక్టోబర్ లేడీస్ నైట్' అనే సినిమా విడుదల కావాల్సి ఉందట.ఇక తమిళంలో చేసిన ఇండియన్ 2 సినిమా షూటింగ్ మధ్యలో ఆగిపోయిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: