అడవి శేష్ పెళ్ళికి... "ప్రభాస్ - అనుష్క"ల పెళ్లి లింక్ ఏంటి?
అడవి శేష్‌ను తాజాగా ఈ ప్రశ్న అడిగితే చాలా తెలివిగా ఆన్సర్ ఇచ్చాడు. అంతేకాదు ప్రభాస్ అనుష్క లకు ఇంకా పెళ్లి కాలేదు కదా ? వాళ్లకు పెళ్లయ్యాకే తాను చేసుకుంటాను అన్నట్లు చెప్పారు. అలాగే ఇక ఇండస్ట్రీలో ఇలా పెళ్లి కావాల్సిన వాళ్లు చాలా మందే ఉన్నారు. వాళ్లకు పెళ్లయ్యాక చూద్దాం.. అన్నాడు. అంతేకాదు తనకు లవ్ ప్రపోజల్స్ చాలానే ఉండగా అందులో ఎక్కువగా పెళ్లయిన ఆంటీలు, ఇతర మహిళలు కూడా ఉన్నారని శేష్ చెప్పాడు. కాగా వారిలో కొంతమంది అయితే తన భర్తను వదిలేసి వచ్చేస్తా, పెళ్లి చేసుకో అని చెప్పిన వారు కూడా లేకపోలేదట. ఇక పెళ్లి విషయంలో ఇంట్లో వాళ్ళ పోరు మరీ ఎక్కువగా ఉందని, చివరికి కొరియన్ అమ్మాయి అయినా పర్లేదు అనే స్టేజ్‌కు రాగా... తనకి మాత్రం ఎవ్వరూ సెట్ కావడం లేదని తెలిపాడు శేషు.
ఇక సినిమాల విషయానికి వస్తే శేష్ ప్రస్తుతం మేజర్ సినిమా ప్రమోషన్స్‌లో చాలా బిజీగా ఉన్నాడు. అంతేకాదు ఈ సినిమా రిలీజ్ అయ్యాక గూఢచారి - 2 కూడా స్టార్ట్ చేస్తాడు. కాగా గూఢచారి సినిమా ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్ హిట్ ను అందుకుందో తెలిసిందే. సీక్వెల్ గా గూఢచారి - 2 చేస్తానని శేష్ ఎప్పుడో చెప్పడంతో చాలా మంది ఈ సినిమా షూటింగ్ సగం అయినా పూర్తయ్యి ఉంటుందని అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి ఈ సినిమా పోస్టర్ రిలీజ్ చేశామే తప్ప.. కథపై ఎటువంటి వర్కౌట్స్ కూడా చేయలేదని చెప్పాడు.