'ఎఫ్2' తో పోలిస్తే 'ఎఫ్3' కి మూడు రెట్ల రెమ్యునరేషన్ పెంచిన వెంకటేష్..!

Pulgam Srinivas
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరైన విక్టరీ వెంకటేష్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విక్టరీ వెంకటేష్ తన సినీ కెరియర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి ఇప్పటికి కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరోగా కొనసాగుతున్నాడు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరోగా కొనసాగుతున్న విక్టరీ వెంకటేష్ తాజాగా నటించిన నారప్ప , దృశ్యం 2  రెండు సినిమాలు కూడా థియేటర్ లలో కాకుండా నేరుగా 'ఓ టి టి' లో విడుదల అయ్యాయి. 

నారప్ప , దృశ్యం 2 సినిమాలు థియేటర్ లలో కాకుండా నేరుగా 'ఓ టి టి' లో విడుదలయినప్పటికీ ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.  ఇలా గత రెండు సినిమాలతో 'ఓ టి టి' ద్వారా ప్రేక్షకులను అలరించిన వెంకటేష్ తన తాజా సినిమా ఎఫ్ 3 తో థియేటర్లలో ప్రేక్షకుల్ని అలరించబోతున్నాడు.  ఎఫ్ 2 సినిమా మంచి విజయం సాధించడంతో ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ గా ఎఫ్ 3 సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఎఫ్ 2 సినిమా మంచి విజయం సాధించడంతో ప్రేక్షకులు ఆఫ్ 3 సినిమాపై మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా వెంకటేష్ కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళ్తే...  వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్ హీరోయిన్ గా తెరకెక్కిన ఎఫ్ 2 సినిమా కు గాను వెంకటేష్ ఐదు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. అయితే తాజాగా తెరకెక్కిన ఎఫ్ 3 సినిమాకు గాను వెంకటేష్ 15 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎఫ్ 2 తో పోలిస్తే ఎఫ్ 3 సినిమా కోసం వెంకటేష్ మూడు రేట్లు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఎఫ్ 3 సినిమాలో కూడా వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా నటించగా తమన్నా, మెహరీన్ హీరోయిన్ లుగా నటించారు. ఎఫ్ 3 సినిమా మే 27 వ తేదీన విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: