NTR 30 : అతను ఫిక్స్.. టెన్షన్ లో అభిమానులు!

Purushottham Vinay
ఇక ఒకప్పుడు వరుస ప్లాపులు ఎదురుకున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆ తరువాత టెంపర్ నుంచి వరుస బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. అప్పటినుంచి ఎన్టీఆర్ నటించిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. దానికి ప్రధాన కారణం ఎన్టీఆర్ తీసుకుంటున్న జాగ్రత్తలే. అప్పటినుంచి తన సినిమాల విషయంలో ప్రతి చిన్న డీటెయిల్ ని కేర్ ఫుల్ గా చూసుకునే ఎన్టీఆర్..కొరటాల శివతో చేస్తోన్న సినిమా విషయంలో ఎన్టీఆర్ డెసిషన్ కరెక్టేనా..? ఇంతకీ ఈ సినిమా పట్టాలెక్కేది ఎప్పుడు అలాగే ఎన్టీఆర్ 30కి సంబంధించిన ఎక్జైటింగ్ డిటేల్స్ ని మనం ఇప్పుడు తెలుసుకుందాం.ఎప్పటి నుంచో వాయిదాపడుతోన్న ఎన్టీఆర్30 సినిమా .. మే 20న ఎట్టకేలకు సెట్స్ పైకి వెళ్తుంది. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే ఎంత క్లాస్ లుక్ లో కనిపించినా కానీ ఫ్యాన్స్ కి మాత్రం ఆయన నుంచి మాంచి మాస్ ఫినిషింగ్ ఉంటేనే మజా. అందుకే ఇప్పటి దాకా తన సినిమాల దగ్గరనుంచి మ్యూజిక్ వరకూ కూడా ప్రతీదీ సేఫ్ సైడ్ లోనే ఉంటూ ఆయన రిస్క్ చెయ్యలేదు. కానీ ఫస్ట్ టైమ్ మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో మాత్రం రిస్క్ చేస్తున్నారు ఎన్టీఆర్. కొరటాల శివతో ఎన్టీఆర్ చెయ్యబోతున్న సినిమాకు తమిళ మ్యూజిక్ సెన్సేషన్ అయిన అనిరుధ్ రవిచందర్ ఫిక్స్ అయ్యాడు.ఇక ఈ కుర్ర మ్యూజిక్ డైరెక్టర్ తమిళ్ లో స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తున్నారు.


రీసెంట్ గా కోలీవుడ్ బిగ్ స్టార్స్ ను తన మ్యూజిక్ తో ఇతను క్రేజీగా స్టెప్పులేయించాడు. కానీ టాలీవుడ్ స్ట్రైయిట్ మూవీతో కమర్షియల్ సక్సెస్ ని మాత్రం కొట్టలేకపోయాడు అనిరుథ్. అయినా ఎన్టీఆర్30తో మరోసారి తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనిరుధ్. నిజానికి ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందించాల్సింది. కానీ లాస్ట్ మినిట్ లో ఛాన్స్ మిస్ అవ్వడంతో ఈ సారి అనిరుధ్ కి మళ్లీ ఛాన్స్ ఇస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇక అంతో ఇంతో క్లాస్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ కే అనిరుధ్ మ్యూజిక్ సెట్ అవ్వనప్పుడు పక్కా మాస్ ఫ్యాన్స్ ఉన్న ఎన్టీఆర్ కి అనిరుధ్ ఎలా ఫిట్ అవుతాడా అంటూ డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి ఫ్యాన్స్ మదిలో. కానీ ఒక్కసారి తమిళ్ లో చూసుకున్నట్లయితే అనిరుధ్ కి చాలా మాస్ హిట్ ఆల్బమ్స్ వున్నాయి. విజయ్, అజిత్, రజినీ, ధనుష్, సూర్య లాంటి స్టార్స్ తో మాస్ సాంగ్స్ చేయించి యూ ట్యూబ్ ని కుమ్మేసిన రికార్డ్స్ అనిరుధ్ కి వున్నాయి. కానీ అదంతా తమిళ్ వరకు ఓకే. కానీ తెలుగులో అనిరుధ్ మ్యాజిక్ పని చేస్తుందా లేదా మరో అజ్ఞాతవాసి అవుతుందా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ భయంతో వున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: