ఈ టైమ్ లో కూడా శివకార్తికేయన్ 'డాన్' మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇన్ని థియేటర్లా..!

Pulgam Srinivas
కోలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు ఆయన శివ కార్తికేయన్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శివ కార్తికేయన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో రేమో సినిమాతో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. రేమో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న శివ కార్తికేయన్ ఆ తర్వాత తాను తమిళంలో నటించిన అనేక సినిమా లను తెలుగులో డబ్ చేసి విడుదల చేసి టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి  విజయాలను అందుకున్నాడు. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితం విడుదల అయిన వరుణ్ డాక్టర్ మూవీ తో కూడా శివ కార్తికేయన్ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు.  

డాక్టర్ వరుణ్ సినిమా విజయంతో మంచి ఫామ్ లో ఉన్న శివ కార్తికేయన్ ప్రస్తుతం డాన్ సినిమాలో హీరోగా నటించాడు.  సిబి చ‌క్ర‌వ‌ర్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ ఈ రోజు అనగా మే 13 వ తేదీన త‌మిళంతో పాటు తెలుగు లోనూ విడుద‌ల కానుంది. ప్రియాంక అరుల్ మోహ‌న్ హీరోయిన్‌ గా న‌టించిన ఈ మూవీ ని  లైకా ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌ తో క‌లిసి శివ కార్తికేయ‌న్ స్వియ నిర్మాణంలో తెరకెక్కించాడు. ఇది ఇలా ఉంటే ఈ రోజు తమిళ్ తో పాటు తెలుగులో కూడా విడుదలైన డాన్ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అదిరిపోయే థియేటర్ లు దొరికాయి. శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కిన డాన్ సినిమా నైజాం ఏరియా లో 85 , సీడెడ్ లో 35 , ఆంధ్ర లో 100 థియేటర్లలో విడుదల అయ్యింది. మొత్తంగా శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కిన డాన్ సినిమా  రెండు తెలుగు రాష్ట్రాల్లో 220 ప్లస్ థియేటర్లలో విడుదల అయ్యింది.

ఇది ఇలా ఉంటే నిన్న అనగా మే 12 వ తేదీన సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా విడుదల అయ్యింది.  అలాగే ఒక వైపు మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఆచార్య సినిమా థియేటర్ లో రన్ అవుతుంది. అలాగే కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమా కూడా విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది. ఇలాంటి  సమయంలో కూడా శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కిన డాన్  సినిమాకు ఈ రేంజ్ లో థియేటర్ లు రెండు తెలుగు రాష్ట్రాల్లో దొరకడం చాలా గొప్ప విషయం అని కొంతమంది భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: