నెటిజన్ కు అదిరిపోయే రిప్లై ఇచ్చిన కృష్ణ వంశీ..!

Pulgam Srinivas
క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  కృష్ణవంశీ కెరియర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించి టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. గులాబి, నిన్నే పెళ్లాడతా, సింధూరం, అంత:పురం, సముద్రం, ఖడ్గం, చందమామ ఇలా ఎన్నో వైవిధ్యమైన సినిమాలకు కృష్ణవంశీ దర్శకత్వం వహించే టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రియేటివ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా తనకంటూ సెపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న కృష్ణవంశీ ప్రస్తుతం సోషల్ మీడియాలో కొంచెం ఎక్కువ గానే యాక్టీవ్ గా ఉంటున్నాడు.  

అందులో భాగంగా కృష్ణవంశీ తాజాగా స్టివెన్ స్పీల్ బ‌ర్గ్ తీసిన వెస్ట్ సైడ్ స్టోరీస్ మూవీ పై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.  మూవీ చూశాను..  బాగా న‌చ్చింది’ అంటూ కృష్ణ వంశీ  ఓ పోస్ట్ పెట్టారు. కృష్ణవంశీ చేసిన ఈ పోస్టుకు  ఓ నెటిజెన్ ‘నీకు సినిమా తీసి విడుదల చేయడం తప్ప అన్నీ ఇంట్ర‌స్టే..’ అంటూ కామెంట్ చేశాడు. అయితే ఆ నెటిజెన్ చేసిన కామెంట్ కు దర్శకుడు కృష్ణవంశీ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు. గాడ్ బ్లెస్ యు’ అంటూ లవ్ సింబల్‌ను అలాగే దండం పెడుతున్నట్టు ఎమోజీలను జత చేసి కృష్ణవంశీ ఆ నెటిజన్ కు రిప్లై ఇచ్చాడు.

ప్రస్తుతం కృష్ణవంశీ  చేసిన ఈ పోస్ట్  నెట్టింట వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కృష్ణవంశీ 'రంగమార్తాండ' అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ , రమ్యకృష్ణ జంటగా నటించారు. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం సమకూరుస్తూ ఉండగా , ఈ మూవీ లో బ్రహ్మానందం, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్, శివాని, కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: