అనుష్క సినిమా నుండి బిగ్ అప్డేట్?

VAMSI
ఎప్పటి నుండో వినపడుతున్న వార్తలకు ఇప్పటికి క్లారిటీ వచ్చింది. సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి , నవీన్ పోలి శెట్టి తో సినిమా చేయబోయేది నిజమేనని ఖరారు అయిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుండి ఫ్యాన్స్ బొమ్మాళి మూవీకి సంబందించిన అప్డేట్స్ గురించి తెగ ఎదురు చూస్తున్నారు. అసలే అనుష్క దాదాపు రెండేళ్ల గ్యాప్ తరవాత చేస్తున్న ప్రాజెక్ట్ కావడం తో మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ మూవీ కి సంబందించిన లేటెస్ట్ న్యూస్ ఏమిటి అంటే.... ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న అనుష్క పాత్రకు 40 ఏళ్ల వయసు ఉండగా ఆమె తన వయసులో సగం ఉండే వ్యక్తి ప్రేమలో పడుతుందట. అదే 20 ఏళ్ల వయసు ఉండే హీరో నవీన్ పోలిశెట్టి ప్రేమలో పడుతుందట.
అయితే వీరి మధ్య పరిచయం, ఇంత ఏజ్ గ్యాప్ లో ఉన్న వీరి ఇద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది, ఆ తరవాత వీరి పెళ్లికి ఎదురయ్యే ఆటంకాలు ఏమిటి , చివరికి ఒకటవుతారా ? లేదా ? అన్నది కథ అన్నట్లుగా సమాచారం. అంతేకాదు ఇక్కడ మరో ఇంటరెస్టింగ్ న్యూస్ ఎంటి అంటే ? అనుష్క ఈ సినిమాలో చెఫ్ పాత్రలో అలరించనుందట. చెఫ్ పాత్ర అని అనుష్క తో  చెప్పడానికి ఆమె ఏమంటుందో ఏమోనని ముందుగా కాస్త సంకోచించారట డైరెక్టర్. అయితే కథ విన్నాక తన పాత్ర , అలాగే స్టోరీ లైన్ చాలా బాగున్నాయి అని చెప్పారట జేజమ్మ.
ఇక ఈ చిత్రానికి ప్రస్తుతానికి మిస్టర్ అండ్ మిసెస్ శెట్టి అనే టైటిల్ ను పెట్టారు. అయితే ఈ టైటిల్ ను మార్చే అవకాశం కూడా ఉంది. యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పి. మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమా నుండి ఒక అప్డేట్ చిత్రపురిలో షికారు చేస్తోందట. అనుష్క నటిస్తున్న ఈ చిత్రంలో తమిళ నటుడు సత్యరాజ్ ఒక కీలక పాత్రలో నటించనున్నారు అని తెలుస్తోంది. ఈ పాత్రా కూడా సినిమాకి చాలా ముఖ్యమట. ప్రస్తుతానికి ఇది ఒక గాసిప్ లాగే ఉంది. త్వరలోనే అధికారికంగా అనౌన్స్ చేస్తారట. కాగా వచ్చే ఏడాదిలో ఈ మూవీ తో మన ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు అనుష్క శెట్టి మరియు నవీన్ పోలి శెట్టి. మరి అప్పటి వరకు ఈ సినిమా నుండి వచ్చే ఒక్కొక్క అప్డేట్ కోసం ఎదురుచూడడమే?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: