ఓ వైపు అసూయా పడుతూనే ఇంకోవైపు.. బాలీవుడ్ తెలివా..!!

P.Nishanth Kumar
ప్రస్తుతం టాలీవుడ్ సినిమా పరిశ్రమ అంటే బాలీవుడ్ కు పీకల దాకా కోపముంది. దానికి కారణం బాలీవుడ్ ను మించిన సినిమాలు ఇక్కడ తెరకెక్కడమే. మొదట్లో ఒకటో రెండో సినిమాలే కదా అని బాలీవుడ్ తెలుగు సినిమాలను లైట్ తీసుకుంది. కనీ ఇప్పుడు అన్ని సినిమాలు కూడా అలాంటివే రావడంతో వారికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇదే రీతిన కొనసాగితే ఫ్యూచర్ లో ఇండియా లో టాలీవుడ్ నెంబర్ వన్ పొజిషన్ కి రావడం ఖాయం. ఇదే జరిగితే ఎన్నో సంవత్సరాల నుంచి అగ్ర సినిమా పరిశ్రమ గా ఉన్న బాలీవుడ్ పరువు పోతుంది అనే భావన వారిలో నెలకొంది.
అలా తెలుగు సినిమాల మీద ఈర్ష్య తో, అసూయా తో బాలీవుడ్ మేకర్స్ రగిలిపోతున్నారు. బాలీవుడ్ ప్రేక్షకులు సైతం అక్కడి సినిమాల కంటే సౌత్ సినిమాలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్న నేపథ్యంలో పుండు మీద కారం చల్లినట్టు అయ్యింది వారికి దాంతో వారిలో ఇప్పుడిప్పుడే చలనం మొదలవుతుంది. ఇన్ని రోజులు వారికి వారే కొట్టుకునే వారు కాస్త ఇప్పుడు ఒక్కరై పోయినారు. తెలుగు సినిమాల మీద, సౌత్ సినిమాల మీద వారు రకరకాలుగా సెటైర్లు వేస్తున్నారు. వారు ఎంత ప్రయత్నించినా రాణి సక్సెస్ సౌత్ వారు ఈజీ గా కొట్టేస్తున్నారెంటి అనే భయం వారిలో నెలకొంటుంది.
అయితే ఓ వైపు వారు మన సినిమాలపై ఈర్ష్య పడుతూనే ఇంకొక వైపు మన సినిమాలతో విజయాలు అందుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు చాలా సౌత్ సినిమాలు బాలీవుడ్  తెరకెక్కుతున్నాయి. దాంతో అయినా వారు విజయాలు సాధిస్తారా అనేది చూడాలి. ఆ విధంగా ఓ వైపు మనపై అసూయ పడుతూ ఇంకొక వైపు మన సినిమాలను అక్కడ చేయడంలో బాలీవుడ్ వారి పోకడ ఏంటో అర్థం కావడం లేదు. ఏదేమైనా సౌత్ సినిమా పరిశ్రమలో కంటెంట్ మాత్రం అందరిని ఎంతో మెప్పిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: