పెట్రోల్ బంక్‌లో పని చేసిన స్టార్ హీరో.. ఎవరో తెలుసా..?

N.ANJI

హీరో అబ్బాస్ గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. 1990లో యువతకు రోల్ మోడల్, ఫ్యాషన్ ఐకాన్‌గా ఎంతో పాపులారిటీని సంపాదించుకున్నారు. అప్పట్లో ఆయన అభిమానులు తన స్టైల్‌నే ఫాలొ అయ్యే వారు. ఎక్కడ చూసినా.. ఏ సెలూన్ షాపులో చూసినా అబ్బాస్ ఫోటోలు మాత్రమే కనిపించేవి. అబ్బాస్ హెయిల్ స్టైల్‌కు కూడా ఫ్యాన్స్ ఎక్కువే. అప్పట్లో అభిమానులు హీరో అబ్బాస్‌లా ఉండేందుకు శ్రమించేవారు. టాలీవుడ్‌లో హీరో అబ్బాస్ ‘ప్రేమదేశం’ సినిమా ద్వారా పరిచయం అయ్యారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా చూసిన ప్రతిఒక్కరూ హీరో అబ్బాస్‌లా ఉండేందుకు ప్రయత్నించేవారు. అలాగే వారి లుక్ కూడా అలాగే ఉండాలని తాపత్రయ పడేవారు.


అయితే అబ్బాస్‌కు తెలుగు ప్రేక్షకులతోపాటు తమిళ ప్రేక్షకులు అధికంగా ఉండే వారు. అబ్బాస్‌కు ఎంతో మందికి ఫేవరేట్ అవ్వడంతో.. ఎంతో ఈజీగా స్టార్ హీరోగా మారిపోయారు. ప్రేమదేశం సినిమా 1996లో రిలీజ్ అయింది. ఈ సినిమాను కుంజుమన్ నిర్మాణంలో కదీర్ సినిమాకు దర్శకత్వం వహించారు. అలాగే ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా వినీత్, అబ్బాస్, టబు నటించారు. అప్పట్లోనే ఈ సినిమా రికార్డులు తిరగరాసింది. ఈ సినిమా మంచి హిట్ అందుకోవడంతో యువతకు అభిమాన హీరోగా అబ్బాస్ మారిపోయాడు. అయితే అబ్బాస్ అసలు పేరు ఎవరికీ తెలియదు. అబ్బాస్ అసలు పేరు ‘మీరా అబ్బాస్ అలీ’. ఇతని తాత పేరు ఫిరోజ్ ఖాన్.’ ఫిరోజ్ ఖాన్ కూడా అప్పట్లో సినీ ఇండస్ట్రీలో ఉండే వారు. 1960-70 కాలంలో మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. అలా అబ్బాస్ కూడా ఇండస్ట్రీకి రావడం జరిగింది.


అబ్బాస్.. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సినిమాలు చేశారు. పలు హిట్ సినిమాల ద్వారా ప్రేక్షకుల్లో అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత తన సినిమాలకు ఫ్యాషన్ డిజైనర్‌గా పని చేశారు. అప్పుడే ‘ఎరూ’ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు. అబ్బాస్‌కు 2003 నుంచి సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో మానసిక వేదనకు గురైన అబ్బాస్.. చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అప్పుడే భార్యాపిల్లలు గుర్తుకు వచ్చి.. చనిపోవాలనే కోరికను వదిలేసుకున్నాడు. ఆ తర్వాత భార్యాపిల్లలను తీసుకొని న్యూజిలాండ్ వెళ్లిపోయాడు. అక్కడ మొదట్లో ఏ పని చేయడానికి దొరకకపోవడంతో.. పెట్రోల్ బంక్‌లో పని చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత మోటివేషన్ స్పీకర్‌గా మారి.. కొద్ది రోజుల్లోనే ఆర్థికంగా స్థిరపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: