అతిలోక సుందరి శ్రీదేవికి వచ్చిన పెళ్లి సంబంధాలు తెలుసా?

VAMSI
శ్రీదేవి అంటే పేరు కాదు ఒక బిగ్ బ్రాండ్ టాలీవుడ్ ఆణిముత్యమే అయినా బాలీవుడ్ లో సెటిల్ అయిన ఈ అందాల తారకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్న విషయం తెలిసిందే. అప్పట్లో ఒక హీరోయిన్ కి ఈ స్థాయిలో గుర్తింపు రావడం అంటే సాధారణమైన విషయం కాదు. అందం, అభినయం కలిగిన ఈ అతిలోక సుందరికి హీరోలకు మించిన హైప్ ను అందుకుని టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగారు. తనకంటే వయసులో 40 ఏళ్లు పెద్దవారైన ఎన్టీఆర్ , ఏ ఎన్ ఆర్ లతోను జతకట్టి ప్రేక్షకుల ప్రశంసలను పొందింది. బడిపంతులు సినిమాలో ఎన్టీఆర్ కి మనవరాలిగా నటించిన శ్రీదేవి కట్ చేస్తే ఏడేళ్ల తరవాత అదే ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇలా ఆమె జీవితం లో ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి.
ఆ తర్వాత బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ బాపు బొమ్మ అక్కడ కూడా స్టార్ హీరోయిన్ గా రాణించారు. ఇంతటి అందాల రాశి, సినీ పరిశ్రమలో కోట్లను పారితోషికంగా అందుకున్న అదృష్టవంతురాలు ఎవరిని పెళ్లి చేసుకుంటుంది అని అంతా ఆసక్తిగా ఉన్న సమయంలో చివరికి బాలీవుడ్ నిర్మాత  బోని కపూర్ ని వివాహం చేసుకుని షాక్ ఇచ్చింది. వీరి మధ్య ఏజ్ గ్యాప్ చాలా ఉంది. అదీకాక బోని గారికి ఇది రెండో వివాహం.  అయితే శ్రీదేవి కి ముందు ముగ్గురు హీరోలతో పెళ్లి ఫిక్స్ అనుకోగా.... అవి క్యాన్సిల్ అయ్యాయని టాక్. ఇంతకీ వారెవరో చూద్దాం.
రాజశేఖర్ ను శ్రీదేవి ని పెళ్లి చేసుకోమని అడిగారట ఆమె తల్లి అయితే... ఆయన ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పారట. ఆ తరవాత మురళి మోహన్ వద్దకు కూడా శ్రీదేవి ని పెళ్లి చేసుకోమని ప్రపోజల్ తీసుకెళ్లారట శ్రీదేవి తల్లి, అయితే ఆయన కూడా కెరియర్ పరంగా ఇపుడు బిజీగా ఉన్నాను అని చెప్పడంతో అది కూడా క్యాన్సిల్ అయ్యిందని సమాచారం. ఆ తర్వాత బాలీవుడ్ హీరో మిథున్ చక్రవర్తి  ప్రేమలో పడింది శ్రీదేవి. కానీ ఆయనకు అప్పటికే పెళ్లి అయ్యింది. కాబట్టి మొదటి భార్యకు విడాకులు ఇచ్చి చట్టబద్ధంగా పెళ్లి చేసుకుంటాను అంటేనే అన్న కండిషన్ పెట్టారట శ్రీదేవి తల్లి. అయితే అందుకు మిథన్ సుముఖంగా లేకపోవడంతో అది కూడా కుదరలేదు.
ఇక అనంతరం నిర్మాత బోని ప్రేమలో శ్రీదేవి పడటం అయన్ను పెళ్లి చేసుకుని ఇద్దరు  బిడ్డలకు జన్మను ఇవ్వడం అన్ని జరిగిపోయాయి. నిజానికి బోని కపూర్ బాగా నమ్మించి శ్రీదేవి ని పెళ్లికి ముందే తల్లిని చేశారట బోని కపూర్ ... ఆ రకంగా ఆమె అక్కడ లాక్ అయిపోయిందని ఒక టాక్. నిజానికి టాలీవుడ్ లో చాలా మంది స్టార్లు ఆమెను పెళ్లి చేసుకోవాలని ప్రపోజ్ చేశారని అయితే శ్రీ దేవి తల్లి కారణంగానే ఆమె అప్పట్లో వాటిని రిజెక్ట్ చేసి కెరియర్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టారని అంటుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: