స్టార్ క్రికెటర్‌ను పెళ్లి చేసుకోనున్న బాలీవుడ్ భామ.. ఎవరో తెలుసా..?

N.ANJI
సినీ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు కామన్ అయ్యాయి. గతంలో కూడా చాలా మంది సెలబ్రిటీలు ప్రేమించుకుని పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇప్పటికీ ఈ ఫార్మెట్ కొనసాగుతోంది. అయితే తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస పెళ్లిళ్లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే స్టార్ హీరో హీరోయిన్లు అలియా భట్-రణ్‌బీర్ కపూర్ వివాహం చేసుకున్నారు. స్టార్ హీరోలతోపాటు నటీనటులు కూడా పెళ్లి బంధంతో ఒక్కటవుతున్నారు. అయితే కేవలం ఇండస్ట్రీకి చెందిన వారే కాకుండా.. ఇండస్ట్రీతో సంబంధం లేకుండా క్రీడాకారులను కూడా పెళ్లి చేసుకుంటున్నారు.
ఇప్పటికే ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి, హీరోయిన్ అనుష్క శర్మ అలాగే పెళ్లి చేసుకున్నారు. తాజాగా బాలీవుడ్‌లో మరో జంట పెళ్లి పీటలు ఎక్కనున్నారు. బాలీవుడ్ హీరోయిన్ స్టార్ క్రికెటర్‌ను వివాహం చేసుకోనుంది. అయితే హీరోయిన్లు-క్రికెటర్లు పెళ్లి చేసుకోవడం ఇప్పుడేం కొత్త కాదు. గతంలో కూడా ఇలాంటి పెళ్లిళ్లు జరిగాయి. ప్రొఫెషన్‌తో సంబంధం లేకుండా.. ప్రేమించి పెళ్లి చేసుకుని ఒక్కటవుతున్నారు. బాలీవుడ్ హీరోయిన్ టీమిండియా క్రికెటర్‌ని త్వరలో వివాహం చేసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి కుమార్తె, హీరోయిన్ అతియా శెట్టి గురించి తెలిసే ఉంటుంది. ‘హీరో’ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. కెరీర్ ప్రారంభంలోనే నిరాశ మిగిలింది. దీంతో ఊహించని స్థాయిలో అవకాశాలు అందలేదు. కాగా, అతియా చాలా రోజులుగా టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ ప్రేమలో పడ్డారు. ఇప్పటికే వీరి ప్రేమ వ్యవహారం బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు. సోషల్ మీడియాలోనూ వీరు కలిసి దిగిన ఫోటోలు షేర్ చేస్తుంటారు.
అయితే అతియా శెట్టి, కేఎల్ రాహుల్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది వివాహ బంధంతో ఒక్కటి కానున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే పెళ్లి పనులు కూడా ప్రారంభించినట్లు, త్వరలో పెళ్లికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం. అయితే సునీల్ శెట్టి ఫ్యామిలీ, కేఎల్ రాహుల్ ఫ్యామిలీ కర్ణాటకకు చెందిన వారు. దీంతో వీరి వివాహం కూడా కర్ణాటక సాంప్రదాయంలోనే జరగనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: