రాజమౌళి వైపు బాలీవుడ్ స్టార్ హీరో కన్ను.. ఏం ప్లాన్ చేస్తున్నాడో తెలుసా..?

N.ANJI

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘బహుబలి, ఆర్ఆర్ఆర్’ వంటి సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా గుర్తింపు పొందారు. ఈ సినిమాలు ఘన విజయం సాధించడంతో స్టార్ హీరోలు సైతం తనతో సినిమాలు తీయాలని క్యూ కడుతున్నారు. ఈ క్రేజ్ టాలీవుడ్‌లోనే కాదు.. బాలీవుడ్‌లో కూడా కొనసాగుతోంది. బాలీవుడ్ స్టార్ హీరోలు బహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు చూశాకా.. రాజమౌళికి వీరాభిమానులు అయ్యారు.


రాజమౌళితో కలిసి ఒక్క సినిమా అయినా చేయాలని ప్లాన్స్ చేస్తున్నారు. ఈ మేరకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ను సంప్రదించినట్లు సమాచారం. అలాగే సినిమా స్టోరీలు కూడా చెప్పమని అడిగినట్లు తెలుస్తోంది. సినిమా స్టోరీ బాగుండి.. స్టోరీ నచ్చి ఓకే చెప్పిన తర్వాతే రాజమౌళి ఈ సినిమా డైరెక్ట్ చేస్తారని సమాచారం. గతంలో బాలీవుడ్ స్టార్ హీరోలు అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ కూడా రాజమౌళితో సినిమా చేయాలని ప్లాన్ చేశారు. కానీ వాళ్లు ఫెయిల్ అయినట్లు తెలుస్తోంది.


ఇప్పుడు తాజాగా ఈ జాబితాలో షారుఖ్ ఖాన్ చేరారు. రాజమౌళితో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే విడుదలైన రాజమౌళి సినిమాలు చూసి షారుఖ్ ఖాన్ ఫిదా అయినట్లు, దేశంలో రాజమౌళి లాంటి డైరెక్టర్ మరెక్కడా లేనట్లు ఆయన పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్నాయి. దీంతో రాజమౌళిపై షారుఖ్ పొగడ్తల వర్షం కురిపించారు. ఇప్పటివరకు రాజమౌళి లాంటి డైరెక్టర్‌ను మరెక్కడా చూడలేదని పేర్కొన్నారు.


అయితే ఈ రేంజ్‌లో షారుఖ్ ఖాన్.. జక్కన్నను పొగిడేస్తుంటే ఏదో ప్లాన్ చేసినట్లే కనిపిస్తోందని అభిమానులు భావిస్తున్నారు. రాజమౌళితో కలిసి సినిమా చేయడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా అనే అనుమానం వ్యక్తం అవుతోంది. ఈ సందర్భంగా షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ.. ‘రాజమౌళి వంటి డైరెక్టర్‌ను నేను ఎక్కడా చూడలేదు. ఆయన విజన్, వర్క్ కి నేను ఫిదా అయ్యాను. సినిమా అవకాశాల కోసం నేను డైరెక్టర్లను, హీరోలను పొగడను. కానీ రాజమౌళి దర్శకత్వం వహించిన అన్ని సినిమాలు నేను చూశారు. ప్రతి సినిమాలోనూ కొత్త విజన్ కనిపించింది. ఆ విజన్‌కి హ్యాట్సాప్. నాతో కలిసి సినిమా చేయాలని అనుకుంటే నేను తప్పకుండా ఓకే చెప్తాను. కానీ సినిమాల్లో అవకాశాలు ఇవ్వమని ఏ డైరెక్టర్‌ను అడగను.’ అని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: