బాబోయ్: టాలీవుడ్‌లో గంజాయి దందా.. డ్రగ్స్‌ ను వీడి..?!

N.ANJI

ఇండస్ట్రీలో డగ్ర్స్ అడిక్ట్ అయిన వాళ్లు అధిక సంఖ్యలో ఉన్నారు. కొందరు వ్యక్తులు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ వారికి గంజాయి, డ్రగ్స్, కొకైన్ వంటి మత్తు పదార్థాలకు బానిస చేస్తుంటారు. అలా ఆ కోణంలో సెలబ్రిటీలు మత్తుకు బానిసలుగా మారి కేసుల్లో ఇరుక్కున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే అన్ని ఇండస్ట్రీల తరహాలోనే టాలీవుడ్‌లో కూడా డ్రగ్స్ మాఫియా నడుస్తోంది. ఇండస్ట్రీని డ్రగ్స్ వదలడం లేదు. కొందరు నటులు మేం డ్రగ్స్ తీసుకోమని చెబుతుంటే.. మరికొందరు డ్రగ్స్ ను వీడి ఉండలేకపోతున్నామని చెబుతున్నారు. అంతలా వారు డ్రగ్స్ కు అడిక్ట్ అయినట్లు సమాచారం.


డ్రగ్స్ భూతం టాలీవుడ్ ఇండస్ట్రీని అస్సలు వీడటం లేదు. కేవలం డ్రగ్స్ అనుకుంటే పొరపాటు.. డ్రగ్స్ తో పాటు ఇప్పుడు తాజాగా గంజాయి కూడా చేరింది. దీంతో ఇండస్ట్రీలో గంజాయి దుమారం రేపుతున్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీకి చెందిన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఒకరు గంజాయి సరఫరా చేస్తుండగా దొరికాడు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 190 కేజీల వరకు గంజాయి స్వాధీనం చేసినట్లు సమాచారం. అతను ఎవరో కాదు అసిస్టెంట్ డైరెక్టర్ హాథిరామ్. ఈయన ‘యుద్ధం శరణం, కురుక్షేత్రం’ వంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఇండస్ట్రీలో హాథిరామ్‌కు పరిచయాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. దీంతో టాలీవుడ్‌లో గంజాయి విచ్చలవిడిగా సరఫరా చేసినట్లు సమాచారం.


గంజాయిని గుట్టుచప్పుడు కాకుండా కర్ణాటక నుంచి తీసుకొస్తున్న క్రమంలో పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. అసిస్టెంట్ డైరెక్టర్ హాథిరామ్ గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆయనతోపాటు మరో ఆరుగురిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, విచారణలో హాథిరామ్ చాలా రోజులుగా గంజాయి సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. పక్కా ప్లాన్‌తో గంజాయి బిజినెస్ చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. అయితే ఇప్పుడు హాథిరామ్ ఎవరెవరికీ గంజాయి సరఫరా చేస్తుండేవాడని తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులు నిమగ్నమయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: