దేవుళ్ళు సినిమా చిన్నారి.. టాలీవుడ్ హీరోయిన్ అని మీకు తెలుసా..?

Divya
ప్రముఖ టాలీవుడ్ సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో సుమారుగా ఇరవై రెండు సంవత్సరాల క్రితం తెరకెక్కిన భక్తిరస చిత్రం దేవుళ్ళు. అందాల తార రాశీ, పృద్వి జంటగా నటించిన ఈ సినిమాలో మరో ఇద్దరు చిన్నారులు కూడా నటించడం జరిగింది. ఇకపోతే విడిపోయిన తల్లిదండ్రులను కలిపేందుకు ఆ ఇద్దరు చిన్నారులు పడిన తాపత్రయం.. ప్రతి ఒక్కరి కంట కన్నీటి ని తీసుకు వచ్చిందని చెప్పవచ్చు. ఇందులో నటీనటుల నటన,  భక్తి పాటలు,  కోడి రామకృష్ణ టేకింగ్ అన్నీ కూడా ప్రేక్షకుల్ని మెప్పించాయి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ఆ రోజుల్లోనే ఎన్నో కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది.
తొలి వారం ఈ సినిమా గురించి పట్టించుకునేవారు లేరు.. ఆ తర్వాత క్రమక్రమంగా సినిమా జనాలకు బాగా ఎక్కడంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం దేవుళ్ళు సినిమాకు బ్రహ్మరథం పట్టారు. రాశి, పృద్వి రాజ్ దంపతులుగా నటిస్తే వారికి పిల్లలుగా బేబీ నిత్య , మాస్టర్ నందన్ నటించారు. తల్లిదండ్రుల ప్రేమ కోసం పరితపించే చిన్నారులుగా నిత్య , నందన్ చాలా అద్భుతంగా ప్రేక్షకులను మెప్పించారు అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో మీ ప్రేమ కోరే చిన్నారులం అనే పాట ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంది అంటే థియేటర్లలో ప్రతి ఒక్కరి కంట నీటిని తెప్పించింది అని చెప్పవచ్చు.
ఇక 2 సంవత్సరాల క్రితం దేవుళ్ళు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన బేబీ నిత్య శెట్టి ప్రస్తుతం హీరోయిన్ అయిపోయింది. అలా మొదటిసారి ఓ పిట్ట కథ అనే సినిమా ద్వారా హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో విజయాన్ని అందుకోలేక పోయిన నటన పరంగా మాత్రం నిత్య కు మంచి పేరు వచ్చిందని చెప్పవచ్చు. నిజానికి ఇప్పటికీ ఈమె అందాన్ని చూసి నిజంగా ఆ పాపే ఈ అమ్మాయా అని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. నటన పరంగా మంచి మార్కులు వేయించుకున్నాడు నిత్య భవిష్యత్తులో స్టార్ హీరోయిన్ గా ఎదగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: