కొరటాల శివ ఇలా అయితే కష్టమబ్బా..!!

P.Nishanth Kumar
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అపజయం లేని దర్శకుల జాబితా అతి తక్కువగా ఉంది అని చెప్పవచ్చు. ఏ దర్శకుడైనా ఏదో ఒక సమయంలో ఒక ఫ్లాప్ రాక మానదు. కానీ కొంతమంది దర్శకులు మాత్రం తాము చేస్తున్న సినిమాల పట్ల వందకు వందశాతం శ్రద్ధ పెట్టి సినిమాలు చేసి ఫ్లాప్ అనేది రాకుండా చేసుకుంటూ ఉంటారు. ఆ విధంగా టాలీవుడ్ దర్శకులలో ఇప్పటిదాకా ఒక్క అపజయాన్ని కూడా అందుకొని దర్శకుడు గా ఉన్నాడు కొరటాల శివ.

మిర్చి సినిమాతో దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ రచయిత తొలి సినిమాతోనే భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. ఆ చిత్రం ఆయనకు తెచ్చిపెట్టిన క్రేజ్ అంతా ఇంతా కాదు. అనుభవం ఉన్న దర్శకుడి తీరుగా ఆయన ఈ సినిమా చేయడంతో అది పెద్ద హిట్ అయ్యింది.  టాలీవుడ్ సినిమా పరిశ్రమకు మరో మంచి దర్శకుడు దొరికాడు అన్న రేంజ్ లో అందరు ఫీలయ్యారు. అలా ఆయన తన తదుపరి సినిమాను మహేష్ బాబుతో చేస్తాడని ఎవరూ కూడా ఊహించలేదు. రెండో సినిమాగా శ్రీమంతుడు చిత్రం అది కూడా భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంది.

రెండవ సినిమాను కూడా విజయవంతం చేసుకోవడంతో ఈ దర్శకుడితో సినిమా చేయాలని కోరుకునే హీరోల సంఖ్య ఎక్కువ అయింది. ఆ తర్వాత ఎన్టీఆర్ తో ఓ సినిమా చేసిన కొరటాల శివ మహేష్ తో మరో సినిమా చేసి ఘన విజయాలన్ని అందుకొని ఒక ఫ్లాప్ ను కూడా తన ఖాతాలో వేసుకోలేదు.ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఆచార్య సినిమా చేస్తున్నారు. ఏప్రిల్ 29వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది. కొరటాల చేసే సినిమాల వరుస ను గమనిస్తే అన్ని కూడా ఒకే ఫార్మట్లో కనిపిస్తున్నట్లు గా ఉంటాయి. ఏదైనా ఒక ఊళ్ళో ఆపద వస్తే బయటనుంచి వచ్చిన హీరో వారి కష్టాలను తీర్చి వారిని ఎలా కాపాడతాడు అనేది ఆయన సినిమా లో ఉన్న ముఖ్య అంశం. ఆ విధంగా ఇప్పటిదాకా ఓకే రకం సినిమాలతో నెట్టుకొస్తున్న ఆయన భవిష్యత్తులోనైనా సినిమా ల ఫార్మాట్ లో మార్పులు చేస్తే బాగుంటుంది అనేది కొంత మంది అభిమానుల మాట. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: