పూరి జగన్నాథ్ కల చిరంజీవి తీర్చగలడా !

Seetha Sailaja
టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో దర్శకుడు పూరీ జగన్నాథ్ తన కెరియర్ పరంగా చూసిన ఎత్తు పల్లాలు ఏదర్శకుడు చూసి ఉండడు. రామ్ గోపాల్ వర్మ కృష్ణవంశీ తేజా లకు సమకాలికుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పూరీ ఎన్నో బ్లాక్ బష్టర్ హిట్స్ తీసాడు. టాప్ హీరోలు అందరితోను సన్నిహితంగా ఉండే పూరీ ఎందుకనో వేగంగా సినిమాలు తీయలేకపోతున్నాడు.

‘ఇస్మార్ట్ శంకర్’ సూపర్ సక్సస్ తరువాత పూరీ మొదలుపెట్టిన ‘లైగర్’ రాబోయే ఆగష్టులో విడుదల కాబోతోంది. ఈమూవీ విడుదల కాకుండానే విజయ్ దేవరకొండ కాంబినేషన్ ను రిపీట్ చేస్తూ మొదలుపెట్టిన ‘జన గణ మన’ వచ్చే ఏడాది రిలీజ్ అవుతుంది ఇలాంటి పరిస్థితుల మధ్య ఎవరు ఊహించని విధంగా పూరీ చిరంజీవి పక్కన ‘గాడ్ ఫాదర్’ మూవీలో చిరంజీవి పక్కన నటిస్తూ ఉండటంతో నటుడు అవ్వాలి అంటూ ఇండస్ట్రీలోకి వచ్చిన పూరీ కోరిక నెరవేరబోతోంది.

వాస్తవానికి దర్శకుడు నటుడుగా మారడం కొత్త కాదు దాసరి విశ్వనాథ్ కోడి రామకృష్ణ లాంటి ప్రముఖ దర్శకులు అంతా నటుడుగా రాణించడమే కాకుండా ఏకంగా నంది అవార్డును కూడ తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ పూరీ ప్రయత్నిస్తే నటుడుగా ఆ స్థాయిలో రాణిస్తాడ అన్న సందేహాలు వస్తాయి. అయితే పూరీ డ్రీమ్ వేరు. మెగా స్టార్ చిరంజీవితో సినిమా తీయాలని అతడి కోరిక. ‘ఆటో జానీ’ మూవీ విషయంలో అవకాశం వచ్చినట్లే వచ్చి మళ్ళీ చేయి జారి పోయింది.

పోరీ ఎవరినైనా తన మాటలతో వెంటనే తన వైపుకు తిప్పుకోగలడు అని అంటారు. ఇప్పుడు చిరంజీవితో కలిసి ఒక వారం రోజులు షూటింగ్ స్పాట్ లో ఉంటాడు కాబట్టి పూరీ తన పాత కథ ‘ఆటో జానీ’ మళ్ళీ మార్పులు చేసి మళ్ళీ చిరంజీవికి చెప్పి అతడి డేట్స్ పట్టేసినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. పూరీ గురువు రామ్ గోపాల్ వర్మ తీస్తున్న సినిమాలు అతడికే అర్థం కాకుండా పోతుంటే కృష్ణవంశీ తేజాలు ఫేడ్ అయిపోతుంటే ఒక్క పూరీ మాత్రమే ఈనాటి తరం టాప్ దర్శకులతో గట్టి పోటీ ఇస్తూ ఇంకా నిలదోక్కుకోవడానికి మళ్ళీ ప్రయత్నాలు చేస్తున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: