ఆంజనేయ స్వామి మాలలో ఎన్టీఆర్...!!

murali krishna
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఒక్కో రికార్డును స్మాష్ చేస్తూ వస్తుంది.. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా… తాజాగా కర్ణాటక సహా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని సరికొత్త రికార్డు క్రియేట్ చేసిందట.

ఈ మధ్య కాలంలో ఒక సినిమా హిట్టైనా.. ఏదో ఒక ఏరియాలో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోలేకపోవడం చూస్తూనే ఉన్నాం కదా.కానీ ఆర్ఆర్ఆర్ మూవీ మాత్రం అన్ని ఏరియాల్లో లాభాల్లో రావడం విశేషం. ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్ మరో ముఖ్యపాత్రలో నటించి మెప్పించారు.. బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ భారతీయ బాక్సాఫీస్ దగ్గర బాగా సత్తా చాటుతోంది.

 
ఆర్ఆర్ఆర్ చిత్రం బాహుబలి 2 రికార్డ్స్ కూడా బ్రేక్ చేయడం గమనార్హం.. నైజాం, యూఎస్ లో వంద కోట్ల మార్కు చేరుకొని సరికొత్త చరిత్ర లిఖించిందట.ఆర్ ఆర్ ఆర్ ఇంత పెద్ద విజయం సాధించిన నేపథ్యంలో హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. తమకు భారీ విజయం అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు కూడా తెలుపుతున్నారు.

అదే క్రమంలో తమ ఇష్ట దైవాల మొక్కులు కూడా తీర్చుకుంటున్నారు. ఆర్.ఆర్.ఆర్ విడుదలైన వెంటనే చరణ్ అయ్యప్ప మాల కూడా ధరించారు. ఇంట్లో జరిగిన పూజా కార్యక్రమాలు జరిపి దీక్ష చేపట్టడం జరిగింది. ఆర్.ఆర్.ఆర్ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో చరణ్ మాలలోనే హాజరయ్యారట ముంబైలో కూడా ఆయన చెప్పులు లేకుండా ఒట్టి కాళ్లతో నడవడం మీడియా దృష్టిని కూడా ఆకర్షించింది.

కాగా ఎన్టీఆర్ సైతం దీక్ష తీసుకోనున్నారని సమాచారం . ఎన్టీఆర్ తన ఇష్ట దైవం ఆంజనేయ స్వామి మాల ధరించడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది.రేపటి నుండి 21 రోజులు ఎన్టీఆర్ ఆంజనేయ స్వామి దీక్షలో ఉంటారని సమాచారం.. చరణ్ ప్రతి ఏడాది క్రమం తప్పకుండా అయ్యప్ప మాల ధరిస్తారట..కానీ ఎన్టీఆర్ అలా దీక్షలు తీసుకున్న దాఖలాలు అయితే లేవు. మరి మిత్రుడు చరణ్ సలహా మేరకో లేక మొక్కు కారణంగానో ఈసారి ఆంజనేయ దీక్ష ధరించనున్నారని సమాచారం.

మరోవైపు ఎన్టీఆర్ కొరటాల మూవీ షూటింగ్ కి సిద్ధమవుతున్నారని తెలుస్తుంది.ఎన్టీఆర్ 30వ చిత్రంగా కొరటాల తెరకెక్కిస్తున్న ఈ మూవీ కోసం ఎన్టీఆర్ బరువు కూడా తగ్గనున్నాడట. అలాగే మూవీ బడ్జెట్ కూడా రూ. 300 కోట్లని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: