షాకింగ్: రామ్ గోపాల్ వర్మ కి ముద్దు పెట్టిన హీరోయిన్ ?

VAMSI
సినిమా పరిశ్రమలో వివాదాల దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే తడుముకోకుండా ఒక్కరి పేరు చెప్పవచ్చు. అది మరెవరో కాదు బాలీవుడ్ లో అంచెలంచెలుగా ఎదిగిన రామ్ గోపాల్ వర్మ. ఇతను సినిమాలకు ఒకప్పుడు మంచి డిమాండ్ ఉండేది. కానీ కాలం మారే కొద్దీ ఇతని నుండి నాసిరకం సినిమాలు రావడం మొదలయ్యాయి. అయినా కానీ నిత్యము ఏదో ఒక వార్తతో ప్రజలకు టచ్ లోనే ఉంటూ వచ్చాడు. మరీ కరోనా వచ్చిన సమయంలో తక్కువ నిడివి కలిగిన సినిమాలను చేసి ఒక సినిమాను ఎలా మార్కెట్ చేసుకోవాలో నిరూపించి చూపించాడు. నిన్న రామ్ గోపాల్ వర్మ తన 60 వ వడిలోకి అడుగు పెట్టాడు.
ఈ సందర్భంగా సినిమా ఇండస్ట్రీ నుండి అనేక మంది ప్రముఖులు ఇతనికి శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆర్జీవీ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక పార్టీలో ఒక హీరోయిన్ డైరెక్ట్ గా ముద్దు పెట్టి అందరికీ షాక్ ఇచ్చింది. అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియూలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆర్జీవీకి ముద్దు పెట్టిన ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? తాజాగా రామ్ గోపాల్ వర్మ తీసిన డేంజరస్ మూవీలో నటించిన నైనా గంగూలీ. ఇప్పటికే విడుదల అయిన ఈ సినిమా ట్రైలర్ కుర్రకారును ఒక ఊపు ఊపుతోంది. మాములుగా ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా ఈ సినిమాలో అభ్యంతరకర కంటెంట్ ఉన్నందుకు థియేటర్ లు రిలీజ్ చేయడానికి ఒప్పుకోవడం లేదు.
ఈ పార్టీలో రామ్ గోపాల్ వర్మ ఒక చేత్తో వోడ్కా బాటిల్ పట్టుకుని ఉన్నాడు. మరో చేత్తో నైనా గంగూలీని పట్టుకుని పార్టీలో ఎంజాయ్ చేస్తూ కనిపించాడు. అయితే సడెన్ గా నైనా గంగూలీ రామ్ గోపాల్ వర్మ బుగ్గపై ఘాటుగా ఒక ముద్దు పెట్టింది. అయితే ఇవన్నీ పట్టనట్టుగా ఆర్జీవీ అంతగా పట్టించుకోలేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: