సూర్య తో మరో సినిమా చేయనున్న సుధా కొంగర..!

Pulgam Srinivas
కోలీవుడ్ హీరో సూర్య గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు,  తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న సూర్య టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఫుల్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు.  టాలీవుడ్ ఇండస్ట్రీలో గజిని సినిమాతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న సూర్య ఆ తర్వాత తాను నటించిన అనేక సినిమాలను తెలుగులో డబ్ చేసి విడుదల చేసి తెలుగు హీరోలతో పాటు సమానమైన క్రేజ్ ను సూర్య టాలీవుడ్ ఇండస్ట్రీలో సూర్య  సంపాదించుకున్నాడు,  తమిళ్ తో పాటు తెలుగులో కూడా అదిరిపోయే క్రేజ్ ను సంపాదించుకున్న సూర్య వరుస అపజయాలతో ఉన్న సమయంలో సూరారై పోట్రూ  సినిమాతో మంచి విజయం అందుకున్నాడు,  ఈ సినిమాను  తెలుగులో ఆకాశమే నీ హద్దురా అనే పేరుతో విడుదల చేయగా ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల నుండి కూడా మంచి ప్రశంసలను అందుకుంది. 

 ఇది ఇలా ఉంటే సూరారై పోట్రూ (ఆకాశమే నీ హద్దురా)  సినిమా నేరుగా ప్రముఖ (ఓ టి టి)  అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది,  ఈ సినిమాకు సుధ కొంగర దర్శకత్వం వహించింది,  ఈ సినిమాతో దర్శకురాలిగా సుధా కొంగరా మంచి గుర్తింపు సాధించింది.  ఇది ఇలా ఉంటే సుధా కొంగర మరోసారి సూర్య హీరోగా సినిమాను తెరకెక్కించబోతున్నట్లు తాజాగా తెలియజేసింది,  తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుధ కొంగర సూర్య తో మరో  మూవీ ని తెరకెక్కించబోతున్నట్లు తెలియజేసింది.   ఇది ఇలా ఉంటే ఆకాశమే నీ హద్దురా సినిమా తర్వాత జై భీమ్ సినిమాతో  సూర్య మరో విజయాన్ని అందుకున్నాడు,  ఈ సినిమా కూడా నేరుగా ప్రముఖ 'ఓ టి టి'  అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది,  ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం సూర్య 'ఈటి'  మూవీ తో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించాడు,  ఈ సినిమా టాలీవుడ్ బైక్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: