వైరల్: కచ్చా బాదాం పాటకు అదిరిపోయే డాన్స్ చేసిన బాలీవుడ్ స్టార్స్..!

N.ANJI

సోషల్ మీడియాలో కచ్చా బాదం పాటను వినని వారుండరూ. ఈ పాట ఆట్ టైం రికార్డులు సృష్టించిన విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పాట అన్ని భాషల్లోనూ వైరల్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సెలబ్రిటీలు ఈ పాటకు స్టెప్పులేసి ఫేమస్ అయ్యారు. ప్రత్యేకంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ పాటకున్న క్రేజ్ వేరే లెవల్. ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు, సోషల్ మీడియా స్టార్లు ఈ పాటకు స్టెప్పులేసి.. విపరీతమైన ఫ్యాన్ ఫాలొయింగ్, క్రేజ్‌ను దక్కించుకున్నారు.


ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ లో అత్యంత ప్రజాదరణ పొందిన పాట కచ్చా బాదం పాట. ఈ బెంగాలీ పాట ఇప్పటికీ నెట్టింట్లో ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు ఈ పాటకు తమదైన స్టైల్‌లో డ్యాన్స్ చేస్తూ అదుర్స్ అనిపించుకుంటున్నారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఈ పాట ట్యాన్‌ని ఎంజాయ్ చేస్తూ రీల్స్ చేస్తున్నారు. ఈ సాంగ్ రిలీజ్ అయి నెల రోజులైంది. అయినా పాటకు క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు.

తాజాగా ఈ పాటకు బాలీవుడ్ స్టార్స్ స్టెప్పులేశారు. స్టార్ హీరోయిన్ మాధురీ దీక్షిత్, స్టార్ హీరో రితేష్ దేశ్ ముఖ్ కచ్చా బాదం పాటకు అదిరిపోయే డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన పలువురు రితేష్ దేశ్‌ముఖ్, మాధురీ దీక్షిత్‌ను మెచ్చుకుంటున్నారు. పాటకు ఎంతో అందంగా స్టెప్పులేశారని పొగుడుతున్నారు.


కాగా, ఈ వీడియోని హీరోయిన్ మాధురీ దీక్షిత్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. అలాగే ‘ఇది చాలా సరదాగా ఉంది కదా?’ అంటూ క్యాప్షన్ పెట్టారు. కాగా, ఈ పాటను పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లా కురల్జూరి గ్రామానికి చెందిన భువన్ బద్యాకర్ పాడారు. కస్టమర్లను ఆకర్షించేందుకు వేరుశనగలు అమ్మడానికి పాట పాడుతుండగా.. ఆ వీడియో సోషల్ మీడియోలో వైరల్ అయింది. ఈ పాటకు రీమిక్స్ యాడ్ చేయడంతో సోషల్ మీడియా స్టార్లు, సెలబ్రిటీలు తమదైన స్టైల్‌లో స్టెప్పులేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: