ట్రైలర్: యాక్షన్ తో అదరగొడుతున్న విజయ్..!!

Divya
మాస్టర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కోలీవుడ్లో స్టార్ హీరో గా మారిపోయారు విజయ్. అయితే తను నటిస్తున్న తాజా చిత్రం బీస్ట్ చిత్రం పై ఆయన అభిమానులు కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు.. ఎందుకంటే ఈ చిత్ర డైరెక్టర్ ఇది వరకే డాక్టర్ వంటి సినిమా తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక విజయ్ సరసన పూజా హెగ్డే కూడా కథానాయికగా నటిస్తూ ఉండడంతో ఈ సినిమాపై మరింత హైప్ పెరిగిందని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన కొన్ని పోస్టర్లు, సాంగ్స్ ప్రేక్షకులను బాగానే అలరించాయి.
అయితే ఈ సినిమా అనుకున్నట్లుగానే షూటింగ్ పూర్తి చేసుకుంటే.. ఈ వేసవికి విడుదల చేయడానికి చిత్ర బృందం సిద్ధంగా ఉంది. అంటే ఏప్రిల్ 13వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్.. ఇక విడుదల సమయం దగ్గర పడుతుండటంతో ఈ రోజు ఉగాది పండుగ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. బీస్ట్ చిత్రంలో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా రూపొందించినట్లు.. ట్రైలర్ ను చూస్తే మనకి పూర్తిగా అర్థమవుతుంది. ఇందులో విజయ్ స్పై ఏజెంట్ రాఘవన్ గా కనిపించనున్నారు.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. ఒక మాల్ లో టెర్రరిస్టులు హైజాక్ చేయగా అదే మాల్ లో విజయ్, పూజా హెగ్డే కూడా ఉంటారు. ఇక విజయ్ ఉగ్రవాదుల నుంచి వారిని ఎలా కాపాడుతారు .. మిషన్ ఎలా పూర్తి చేస్తాడో తెలియాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇందులో డైరెక్టర్ సెల్వరాఘవన్, యోగి బాబు ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ట్రైలర్ లో  పూజా హెగ్డే కి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వ లేనట్లు కనిపిస్తోంది. ఈ చిత్రం భారీ యాక్షన్ స్థాయిలో చాలా టైల్స్ డిజైన్ గా చేయబడినట్లు కనిపిస్తోంది. ఇందులో విజయ్ సరికొత్తగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక చివరిగా చెప్పే డైలాగ్ కి ట్రైలర్ కే హైలెట్ గా నిలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: