ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో కీలక సాక్షి ప్రభాకర్ మృతి.. కారణం..!!

Divya
బాలీవుడ్ నటులలో షారుక్ ఖాన్ కూడా ఒకరని చెప్పవచ్చు.. ఇక ఆయన కుమారుడు ఆర్యన్ ఖాన్ . కూడా ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఇకపోతే బాలీవుడ్ అగ్ర నటులలో ఒకరిగా చలామణి అవుతున్న ఆర్యన్ ఖాన్ తన కొడుకు చేసిన పనికి ఒక్కసారిగా మర్యాద పోగొట్టుకున్నారు. ఇక కొడుకు చేసిన పనికి తీవ్రంగా నష్టపోయిన షారుక్ ఖాన్ ఎలాగైనా సరే డ్రగ్స్ కేసు నుంచి కొడుకుని విడిపించుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించారు. ఇక ఎట్టకేలకు సల్మాన్ ఖాన్ తో పాటు పలువురు ప్రముఖుల సహకారంతో బెయిల్ మీద విడుదల చేయడం జరిగింది.
ఇకపోతే ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో కీలక సాక్షి అటువంటి ప్రభాకర్ సెయిల్ నిన్న అనగా శుక్రవారం మధ్యాహ్నం ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్లో గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన లాయర్ తుషార్ ఖండారే తెలిపారు. అయితే ప్రభాకర్ మృతి చెందిన సమయంలో ఆయన ఇంట్లోనే ఉన్నారని ఇందులో ఎలాంటి అనుమానాలు లేవని అన్నారు. ఇకపోతే ప్రభాకర్ మృతిపై చాలామంది రకరకాల అనుమానాలు వ్యక్త పరిచినప్పటికీ ఇందులో అనుమానాలు వ్యక్తం చేసిన అవసరం లేదు అని ఆయన సహజంగా గుండెపోటుతో మరణించారు అని స్పష్టం చేశారు ప్రభాకర్ లాయర్.
ప్రభాకర్ కి తల్లి, భార్య , ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. గ్రామంలో ఉన్న సోదరులు వచ్చిన తర్వాతనే అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు గా కుటుంబ సభ్యులు స్పష్టం చేయడం జరిగింది. డ్రగ్ క్రూయిజ్ కేసులో అరెస్టయిన ఆర్యన్ ఖాన్ కేసులో మరో సాక్షి అయిన కేపీ గోసావికి ప్రభాకర్ సెక్యూరిటీ గార్డుగా ఉన్నారు. ఈయన నిన్న  మరణించడంతో ఇది ఎవరో కావాలనే పన్నాగం పన్ని ఆయనను చంపేసి.. గుండెపోటు కింద చిత్రీకరించారు అని మరికొంతమంది అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. ఇక మరికొంతమంది ఏమో  కావాలనే చంపేసారేమో అంటూ ఇలా  ఎన్నో రకాలుగా వార్తలు వినిపిస్తూనే ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: